28.7 C
Hyderabad
April 28, 2024 08: 44 AM
Slider పశ్చిమగోదావరి

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అనునిత్యం తపన

#dendulurumla

పేదరికాన్ని పారదోలాలన్నదే  ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి  ఆలోచన అని పలువురు రాజకీయ నాయకులు కొనియాడారు. ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కొటారు రామచంద్రరావు నేతృత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఏలూరు మాజీ ఎం ఎల్ ఏ (మాజీ మంత్రి)మరదాని రంగారావు, ఆళ్ల సతీష్, మేకా లక్ష్మణరావు, పళ్లెం ప్రసాద్, దెందులూరు జెడ్ పి టి సి నిట్ఠా లీలా నవకాంతం తదితరులు పాల్గొని మాట్లాడుతూ నియోజక వర్గం లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి రోజు ఉదయం ప్రజా సమస్యలు వినడం తో ప్రారంభమయ్యే ఎం ఎల్ ఏ షెడ్యూల్ అర్ధరాత్రి వరకూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉంటుందని తెలిపారు.

ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిద్రపోని ఎం ఎల్ ఏ  దెందులూరు ప్రజలకు దొరకడం దెందులూరు ప్రజల పూర్వ జన్మ సుకృతమని కొటారు అబ్బా చౌదరి సేవలను  కొనియాడారు. నియోజక వర్గం లో అభివృద్ధి సంక్షేమం కోసం తపిస్తూ పేదరిక నిర్మూలనకు చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు అన్వేషించి జీవనోపాధి కల్పిస్తున్న ఉన్నత విద్యా వేత్త ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి అని వక్తలు వివరించారు. అబ్బయ్య చౌదరి జన్మదిన వేడుకలలో దెందులూరు, ఏలూరు, పెదవేగి, పెదపాడు మండలాల నుండి వై సి పి నాయకులు కార్యకర్తలు. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్హున తరలివచ్చారు. ఎం ఎల్ ఏ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్త  దాన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ వేడుకలలో ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి పాల్గొనక పోవడం తో వై సి పి శ్రేణులు కొంత అసంతృప్తి చెందారు.

Related posts

అంబర్ పేట్ లో బస్తీలో బిఆర్ఎస్ కార్యక్రమం

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: నిర్భయ దోషులకు రేపు ఉరి ఖరారు

Satyam NEWS

హైదరాబాద్ లో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తాం

Satyam NEWS

Leave a Comment