27.7 C
Hyderabad
May 18, 2024 01: 01 AM
Slider శ్రీకాకుళం

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

#pawankalyan

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు నిలిచారు. తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా బుధవారం శ్రీకాకుళం నగరంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ప్రతినిధులు కిరణ్ ,లక్ష్మణ్ ,చంటి ల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించగా అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ప్రారంభించారు.

జిల్లాలోని వివిద ప్రాంతాల నుంచి తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్చంధంగా రక్తదానం చేసారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు  పిలుపు మేరకు రాష్ట్ర చిరంజీవి యువత,పవన్ కళ్యాణ్ జిల్లా అభిమానులు కలిసి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. మెగా అభిమానులంతా కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుఉంటారన్నారు.

భీమ్లా నాయక్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించగా విశేష స్పందన లభించిందన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు దానం చేసిన రక్తాన్ని తలసేమియా బాధితులకి అండగా నిలిచేందుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. మెగా స్టార్ చిరంజీవి స్పూర్తితోనే నేడు అభిమానులంతా కూడా స్వచ్చంద రక్తదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తైక్వాండో శ్రీను తెలిపారు.

రక్తదానం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులకి ఈ సందర్భంగా సర్టిఫికేట్లను ఎన్ జి జ్యూయలర్స్ అధినేత పృథ్వీ,సీనియర్ చిరంజీవి అభిమానులు పైడి శ్రీను,వైశ్యరాజు మోహన్ ,రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య ల చేతుల మీదుగా అందజేసారు.

ఈ కార్యక్రమంలో కిన్నెర థియేటర్ కాంప్లెక్స్ మేనేజర్ ప్రసాద్ ,సరస్వతి ధియేటర్ మేనేజర్ చిన్న.రాజు,ఎస్.వి.సి మేనేజర్ రవి ,పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ప్రతినిధులు గొర్లె.కిరణ్ కుమార్,తైక్వాండో లక్ష్మణ్ , పెయ్యల చంటి, మూల సంతోష్ ,అరసవల్లి మోహన్ ,బడే మోహన్ ,జి.కిరణ్ ,ఆలీ,సత్తిబాబు లు పాల్గొన్నారు.అలాగే   రామ్ చరణ్ యువశక్తి ప్రతినిధి తైక్వాండో గౌతమ్ ,తేజ,మదీనా,పంకు మురళి,  అల్లు అర్జున్ ఫ్యాన్స్ అద్యక్షుడు పుక్కల నవీన్ , భాను, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ ,  వరుణ్ తేజ్  అభిమాన సంఘం అధ్యక్షుడు  శీర రుద్ర రాజు , తదితర అభిమానులు హాజరయ్యారు.

Related posts

ప్రతి టీచర్ పది మంది స్టూడెంట్స్ ను అడాప్ట్ చేసుకుంటే సరి

Satyam NEWS

12 భాషల్లో ప్రవేశమున్న ముఖేష్ కుమార్ దర్శకుడిగా “సమంత”

Satyam NEWS

క్రమశిక్షణకు మారుపేరు గురుకులాలు

Satyam NEWS

Leave a Comment