33.2 C
Hyderabad
May 4, 2024 00: 25 AM
Slider కరీంనగర్

క్రమశిక్షణకు మారుపేరు గురుకులాలు

#gangulakamalakar

రాష్ట్రంలో క్రమశిక్షణకు మారుపేరుగా మహాత్మజ్యోతిరావుపూలే గురుకులాలు నిలువడం అభినందనీయయమని, విద్యార్థుల సౌకర్యార్ధం సీఎం కేసీఆర్‌ తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలో కొత్తగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డా.బిఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో శనివారం రాత్రి మహాత్మ జ్యోతిరావుపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (ఎంజెపీటీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రతి గురుకులంలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. తాము చదువుకున్న సందర్భంలో ఇంతలా సౌకర్యాలు చూడలేదని, గతంలో చాలా మంది చదువుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ ఆర్ధిక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదన్నారు.

తెలంగాణాలో 53 శాతం మంది బీసీలున్నప్పటికీ గత ప్రభుత్వాలు కేవలం 9 గురుకులాలను మాత్రం మనకు కేటాయించారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 281 బీసీ గురుకులాలలను ఏర్పాటు చేసి లక్షా 51వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మంచి విద్య, నాణ్యమైన భోజనం, వసతి, సౌకర్యాలు అందించేందుకు లక్షా 25వేలను ఖర్చు చేస్తుందన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. బీసీ బిడ్డలకు సేవలందించేందుకే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ కు కతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి గురుకులంలో విద్యార్థులకు వేడినీళ్లను అందించేందుకు చర్యలు – తీసుకుంటున్నామన్నారు.

కరీంనగర్‌ జిల్లాలోనే రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గురుకులంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగినప్పుడే సంతోషంగా ఉంటుందన్నారు. మానకొండూర్‌ ఎంఎ, రాష్ట్ర సాంస్కతిక సారధి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ ఇప్పుడు గురుకులాల్లో అందుతున్న సౌకర్యాల్లో సగమైన మేము చదువుకున్నప్పుడు ఉంటే మరింత ఉన్నతస్థాయికి ఎదిగేవాళ్లమన్నారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలన్నారు. గతంలో గురుకులాల్లో తమ పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఉండేవని, సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలతో నేడు గురుకులాల్లో సీట్లు కావాలంటే ్ఢ ప్రజా ప్రతినిధులతో పైరవీలు చేయించే స్థాయికి అభివద్ధి చెందాయన్నారు. చొప్పదండి ఎంఎ సుంకే రవిశంకర్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణాలోనే గురుకులాలు అన్ని రకాల సౌకర్యాలతో కార్పొరేట్‌ కు ధీటుగా మారాయన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌ ఎంఎలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, అధ్యాపకులు నత్యాలు చేస్తూ ఉత్తేజం ్ఢ నింపారు. ఈ క్రీడా పోటీల్లో బాలికల విభాగంలో వేములవాడ బీసీ వెల్ఫేర్‌ గురుకుల విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ ను కైవసం చేసుకోగా బాలుర విభాగంలో సైదాపూర్‌ బీసీ గురుకుల విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ను కైవసం చేసుకున్నారు.

అథ్లెటిక్స్‌ తో పాటు క్యారమ్స్, చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఉమ్మడి జిల్లా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనుండగా అందులో విజయం సాధించిన వారిని ఇంటర్‌ సొసైటీ లీగ్‌ పోటీల్లో పాల్గొంటారని నిర్వహాకులు పేర్కొన్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో డీవైఎఓ కె రాజవీరు, ఆర్‌ సీఓ గౌతంరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధదికారి రాజమనోహర్‌ రావు, గురుకులాల ప్రిన్సిపల్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్‌ విద్యార్థులతో కలిసి అదిరేటి స్టెప్పులు వేసి అలరించారు.

Related posts

దిస్ ఈజ్ ఇండియా: రవిశంకర్ అంత్యక్రియల్లో పాల్గొన్న ముస్లింలు

Satyam NEWS

విజయనగరం పైడితల్లి ఆలయ విస్తరణ కు తొలగిన అడ్డంకులు

Bhavani

బాధ్యతతో పాటు భరోసా ఇచ్చే గొప్ప వృత్తి పోలీస్

Satyam NEWS

Leave a Comment