28.7 C
Hyderabad
May 6, 2024 01: 25 AM
Slider నల్గొండ

33 రోజులైంది… ముఖ్యమంత్రి గారూ జోక్యం చేసుకోండి…

#muslims

అత్యంత విలువైన షాపింగ్ కాంప్లెక్స్ పై వక్ఫ్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ముస్లిం మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్టు కార్డుల ద్వారా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. 33 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా అధికారులలో ఏ మాత్రం చలనం కనిపించడం లేదని ముస్లిం మహిళలు ఆరోపించారు.

అక్రమ దుకాణదారులపై వక్ఫ్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మసీదు ముందు బుధవారం ముస్లిం సోదరీమణులు ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి కెసిఆర్ కి పోస్ట్ కార్డులు పంపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షేక్ సైదాబీ, మహ్మద్ నసీమా మహిళ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీ నాయకుడు మహ్మద్ అజీజ్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అధికారులు ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యం వహిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. మసీదు సొమ్మును దోచుకుని తింటున్న అక్రమ లీజుదారులపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

గత 13 నెలలుగా ఉస్మానియా మసీదు అభివృద్ధి, నిర్వహణ ఆగిపోయిందని, జీతభత్యాలు లేక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం తగునా? అని ఆయన ప్రశ్నించారు. అద్దె చెల్లించని అక్రమ దుకాణాదారులను తొలగించి ఈ దుకాణాలకు బహిరంగ వేలం వెయ్యటానికి ఎందుకింత తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

28 సంవత్సరాలుగా ఉస్మానియా మసీద్ కాంప్లెక్స్ దుకాణాలలో ఉంటూ గత 13 నెలలుగా మసీద్ కమిటీ నిర్ణయించిన అద్దెలను చెల్లించకుండా ఉండటంలో ఆంతర్యం ఏమిటి అని అన్నారు. తామే మస్జిద్ కాంప్లెక్స్ యజమానులమని భార్యల పేరు మీద షాపులు తీసుకొని నాటి నుండి నేటి వరకు అతి తక్కువ అద్దెలు చెల్లిస్తూ వాళ్ళ సొంత ఆస్తులుగా భావిస్తున్నారని ఆయన అన్నారు.

28 సంవత్సరాల నుండి మసీద్ కాంప్లెక్స్ పై పెత్తనం చెలాయిస్తూ మసీదు సొమ్మును దోచుకుంటున్న లీజు దారులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని అన్నారు. అక్రమ లీజులను రద్దు చేసి, పెత్తందారీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని వక్ఫ్ బోర్డు అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

12 సంవత్సరాల క్రితమే లీజు ముగిసిన మస్జిద్ కాంప్లెక్స్ అక్రమ లీజు దారులను డిఫాల్టర్లుగా గుర్తించి వారిపై వక్ఫ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,గత 33 రోజులుగా హుజూర్ నగర్ పట్టణ ముస్లిం సోదరులందరూ ఐక్యంగా ఉద్యమం కొనసాగిస్తూ నిరసనలు తెలియ చేస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మీరైనా స్పందించి ఈ సమస్యను తక్షణం పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు షేక్.సైదాబీ, లాల్ బి, సమిన, హసీనా, మీరా, ఆస్మా, మెహ్రీన్, ఆయేషా, ఫాతిమా, నస్రీన్,ముంతాజ్ బేగం,అష్రఫ్, మస్తాన్ బి,షేక్.జానీ బేగం,సమీనా, రేష్మా,గాలి బి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మంత్రి బొత్స సత్యనారాయణ పని అయిపోయింది

Satyam NEWS

షెడ్యూల్: డోనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళతారు? ఏం చేస్తారు?

Satyam NEWS

న్యాయమూర్తుల్ని దూషించిన మాజీ జస్టిస్ పై కేసు

Satyam NEWS

Leave a Comment