30.2 C
Hyderabad
May 17, 2024 15: 34 PM
Slider ఖమ్మం

పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

#Snehalatha Mogili

మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులతో మన ఊరు-మన బడి, ప్రత్యేక అభివృద్ధి నిధులు, బిసిలకు ఆర్థిక సహాయం లపై సమీక్షించారు.

మన ఊరు-మన బడి కార్యక్రమంలో మండలం వారిగా చేపట్టిన పనులు, పూర్తయి పునఃప్రారంభం అయిన పాఠశాలలు, ఇంకనూ పూర్తి కాని పనుల గురించి అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పనుల పూర్తికి చాలా సమయం తీసుకున్నట్లు, రోజువారి పర్యవేక్షణ చేసి పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల కేంద్రంలో మంచి వాల్ పెయింటింగ్ కి అనువుగా ఉన్న పాఠశాలలు గుర్తించి, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

వాల్ పెయింటింగ్ పనులను స్థానిక సంస్థల ద్వారా చేపట్టాలన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల విషయమై ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల పనులకు సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు. మంజూరు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల ప్రారంభానికి సమస్యలు ఉంటే, సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. బిసి లకు రూ. లక్ష ఆర్థిక సహాయానికి సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Related posts

రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పాలు పండ్లు పంపిణీ

Satyam NEWS

క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ లను అభినందించిన కవిత

Bhavani

కాశ్మీర్ తరలి వెళ్లిన అజిత్ దోవల్

Satyam NEWS

Leave a Comment