28.2 C
Hyderabad
May 17, 2024 14: 40 PM
Slider ముఖ్యంశాలు

బైబిల్ ప్రభుత్వం కావాలా? భగవద్గీత ప్రభుత్వం కావాలా?

#BandiSainjai

ఆంధ్రప్రదేశ్ లో ఒక మతం రాజ్యమేలుతోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు  బండి సంజయ్‌  అన్నారు. అందుకే బైబిల్ ప్రభుత్వం కావాలా, భగవద్గీత ప్రభుత్వం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

సోమవారంనాడు హైదరాబాద్ లోని బిజెపి కార్యాలయంలో కామారెడ్డి జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిజెపిలో చేరుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనలపై బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు.

హిందువుల కానుకలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ దారి మళ్లీస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సహనాన్ని పిరికితనంగా సీఎం జగన్‌ భావించొద్దని అన్నారు. బిజెపి కార్యకర్తలు రోడ్డు ఎక్కితే జగన్‌, వైకాపా మూటముల్లె సర్దుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

తెలంగాణలో జరిగినట్లు.. ఏపీలోనూ జగన్​కు ప్రజలు షాక్ ట్రీట్‌మెంట్‌ ఇస్తారన్నారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

గణనాథుని ఆశీస్సులు ప్రజలందరు పై ఉండాలి

Satyam NEWS

11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం ఈ నెల 18న

Satyam NEWS

“తిరుపతి జిల్లా” గా పేరు మార్చాలి

Satyam NEWS

1 comment

ఉప్పల శ్రావణ్ కుమార్ గుప్తా January 4, 2021 at 7:29 PM

మేము రోజు ఒక సారి అయిన భగవత్ గీతను మొక్కుతాము ప్రతి పండకు ప్రతి వారం ఏదోఒక గుడికి వెళ్తాము ఎవ్వరి మతాలు వారివి మాకు ఆవివృద్ది చేసే పార్టీ కావాలి మతాల మధ్య చిచ్చు రేపుతున్న పార్టీలు అవసరం లేదు గత ఆరున్నర సంవత్సరలా క్రితం శుక్రవారం వచ్చిందంటే ప్రతి మసీదుకు వందలమంది పోలీసులతో బంధవస్తు ఏర్పాట్లు చేయవలిసి వచ్చేది ఇప్పుడు శుక్రవారం నాడు ఏ ఒక్క మసీదు వద్ద ఒక్క పోలీసులు ఉండడం లేదు మత ఘర్షణలు లేవు 24 విద్యుత్ ఉంటుంది గతంలో రోజు 8 గంటలు విద్యుత్ వుండేది కాదు నేరాలు తగ్గినవీ మీ బిజెపికి దమ్ము ఉంటే నోట్ల రద్దు చట్టం అమలు చేశారు జి ఎస్ టి చట్టం అమలు చేశారు ఇంకా రోడ్ సేఫ్టీ బిల్లు తెచ్చారు రోడ్ సేఫ్టీ బిల్లు తెచ్చి ప్రజల నడ్డి నడ్డి విరుస్తున్నారు మీ ప్రభుత్వ వచ్చినపడినుండి నిత్యావసర సరుకులు 4రేట్లు పేరిగినయి పెట్రోలు చెప్పనవసరం లేదు ఎంత పెరిగిందో రైతుకు గిట్టుబాటు ధర లేదు అది కెమెడ్రే బాధ్యత కాదు ఇన్ని చేసినోళ్ళు దమ్ము ఉంటే ఒకే ఒక్క చట్టం తెండి ఒకే దేశం ఒకే మతము ఉండాలి అని ఒకే దేశం ఒకే పన్ను అంటారుగా మత రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారు అలాంటి ప్రజలు నమ్మరు

Reply

Leave a Comment