ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి సూర్యనారాయణ రాజు(Dr G S N Raju, NIMS) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజిగూడా లో అశ్విన్స్ స్పెషాల్టి ఆస్పత్రి రాబోతున్నది. దేశంలో ప్రఖ్యాత సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. జి ఎస్ ఎన్ రాజు హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం సర్జికల్ ఆంకాలజీ విభాగం అధిపతిగా పని చేసిన విషయం తెలిసిందే.
ఆయన ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించి ఎందరికో పునర్జన్మను ఇచ్చారు. ఆయన ఇటీవలె పదవీ విరమణ చేశారు. అనంతరం స్వీయ నిర్వహణ లో కాన్సర్ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందుబాటులో తెచ్చేందుకు అనుభవజ్జులైన వైద్య బృందంతో కలసి అశ్విన్స్ హాస్పిటల్ ను సిద్ధం చేశారు.
నిమ్స్ లో సర్జికల్ ఆంకాలజి విభాగ అధిపతిగా అసంఖ్యాకంగా రోగులను కాన్సర్ నుంచి విముక్తులను చేసిన సూర్యనారాయణ రాజు ఇక నుంచి వారి స్వీయ నిర్వహణలో ఏర్పాటైన అశ్విన్స్ లో చికిత్సలు చేస్తారు.
డా. జి ఎస్ ఎన్ రాజు విద్యార్ధిగా, వైద్యునిగా అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించి అనేక అవార్డులు, రివార్డులు గెల్చుకుని, సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్: 040-2332 3344/ 94404 45775