27.2 C
Hyderabad
May 18, 2024 19: 44 PM
Slider ముఖ్యంశాలు

40 ఏళ్ల సర్వీసు అంతా నిజాయితీగా పని చేశాను

#Dr.Rameshkumar

రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం లో స్థానిక సంస్థలు ఎన్నికల ఏర్పాట్లు పై కలెక్టర్, ఎస్పీ లతో సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్.ఈ. సి.కు  రాజ్యాంగం విస్తృత స్థాయి అధికారులు కల్పించిందని, వాటిని సక్రమంగా అమలు చేయవలసిన  బాధ్యత  ఎన్నికల కమిషన్ కు ఉందన్నారు.

ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. 40 సంవత్సరాల కాలం  ఉద్యోగ జీవితంలో ఎటువంటి ఆరోపణలను.. అవాంతరాలు లేకుండా అందర్నీ మొప్పించి పనిచేశాను అని అన్నారు.

ఎన్నికల కమిషన్ కు స్వీయనియంత్రణ ఉంది. నీతిగా..నిజాయతీగా నిబద్ధతతో పనిచేశాను అని స్పష్టం చేశారు… రాజ్యాంగం కల్పించిన ఈ బాధ్యతలు సక్రమంగా అమలు చేసి…ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు  నిర్వహిస్తామని అన్నారు.

ఏకగ్రీవ ఎన్నికలకు తాను వ్యతిరేకిని కాను అని…బలవంతపు ఏకగ్రీవాలకు తాను అంగీకరించనని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పనితీరు అద్భుతం గా ప్రశంసించారు… ప్రతిభా వంతులైన అధికారులు శ్రీకాకుళం జిల్లాలో పనిచేయటం వల్ల జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Related posts

జర్నలిస్టులను ఆదుకోవాలి

Murali Krishna

మైక్రో అబ్జర్వర్లకు ములుగులో శిక్షణా కార్యక్రమం

Satyam NEWS

సమాచార హక్కు చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన పెంపొందించాలి

Murali Krishna

Leave a Comment