34.2 C
Hyderabad
May 16, 2024 15: 59 PM
Slider తెలంగాణ

రక్తపు వాంతులతో గురుకుల పాఠశాల విద్యార్థిని ఆకస్మిక మృతి

medak

అందరిలో కలివిడిగా ఉంటూ.. చదువుల్లో రాణిస్తున్న ఆ చిట్టితల్లిని తెలియని జబ్బు కబళించింది. జ్వరం వచ్చిన రెండు రోజుల్లోనే ఆరోగ్యం విషమించి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. డాక్టర్లకు సైతం తెలియని జబ్బు ఆ పసిపాప ప్రాణాలను తీసేసింది.  ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపాప ప్రాణాలను కాపాడలేక పోయారు. తమ గారాలపట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆపాప తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఆమె బంధువులు కావ్య మృతదేహాన్నీ ఆస్పత్రి నుంచి నేరుగా మెదక్ గురుకుల హాస్టల్ కు తీసుకువచ్చి ఆందోళనకు దిగారు. చిన్నారి కావ్య ఆకస్మిక మృతితో ఆమెతో పాటు చదువుకుంటున్న మెదక్ లోని తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  పరామర్శించడానికి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ సైతం కంటనీరు పెట్టుకున్నారు. గురుకుల విద్యార్థులను, చిన్నారి కావ్య తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్, ఏఎన్ ఎంలను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

తాజాగా మెదక్ పట్టణానికి చెందిన నాయిని కావ్య (15) అకస్మాత్తుగా జ్వరం వచ్చి ఒక్కరోజులోనే మృతి చెందింది. మెదక్ పట్టణానికి చెందిన అశోక్, స్వప్న కుమార్తె అయిన కవిత..స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం కావ్యకు జ్వరం వచ్చిందని పాఠశాల నుంచి తల్లితండ్రులకు ఫోన్ చేసారు. హుటాహుటిన పాఠశాలకు వెళ్లిన తల్లితండ్రలు ఆమెను చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకొచ్చారు.

ఇంటికి రావడంతోనే  కావ్య రక్తపు వాంతులు చేసుకొంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిస్థితి విషయమించడంతో ముందు కొంపల్లి రష్ ఆస్పత్రికి అనంతరం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో కొనఊపిరితో ఉన్న కావ్యను బతికేంచుందకు వైద్యులు పడ్డ శ్రమ వృథా అయింది. కావ్యను కాపాడేందుకు మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. మృతి చెందిన కావ్య పార్థివ దేహాన్ని స్వస్థలమైన మెదక్‌కు తరలించారు.

పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్టు ఆరోపిస్తూ.. తల్లిదండ్రులు బంధువులు పాఠశాల ముందు మృత దేహంతో బైటాయించారు. స్కూల్ ప్రిన్సిపల్, వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారాకో నిర్వహించారు. కావ్య మృతికి సంతాపంగా మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్చందంగా మూసివేసారు. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఆరోగ్యంగా ఉండే కావ్య మృతితో మెదక్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురుకుల పాఠశాలకు వెళ్లిన జిల్లా జాయింట్ కలెక్టర్ అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. జేసీని పట్టుకుని ఏడ్చారు. దీంతో జేసీ కూడా వారిని ఓదార్చుతూ కంటనీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడ ఉన్నవారినందరిని కదిలించింది. కావ్య మృతికి కారణమైన వారిని సస్పెండ్ చేస్తామని జేసీ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అలాగే కావ్య తల్లికి ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇస్తామని తెలిపారు. స్కూలు యాజమాన్యం మాత్రం కావ్యకు జలుబు అయితే మందులు వేసామని చెప్పారు. ఇంతలోనే ఆమె మరణించడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

Related posts

అమరావతి అంశంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం

Satyam NEWS

కాంట్రవర్సీ ఎగైన్: జగన్ ఎప్పుడో సిఎం అయ్యేవాడు

Satyam NEWS

ఘనంగా వినాయక నిమజ్జనం

Bhavani

Leave a Comment