దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ఇవాళ ట్విటర్లో స్పందిస్తూ… ‘‘భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆమెకు వినయపూర్వక నివాళులు…’’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం వద్ద ‘‘ఐక్యతా పరుగు’’ను ప్రారంభిస్తూ ఆయన ఇందిరా గాంధీని స్మరించుకున్నారు. భారత తొలి, ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ… 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు సేవలు అందించారు. మళ్లీ తిరిగి జనవరి 1980 నుంచి హత్యకు గురైన అక్టోబర్ 1984 వరకు ప్రధానిగా కొనసాగారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’కి నిరసనగా 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీని సిక్కు వర్గానికి చెందిన సొంత బాడీగార్డులే పొట్టనబెట్టుకున్నారు.
previous post