26.7 C
Hyderabad
May 1, 2025 04: 52 AM
Slider ప్రత్యేకం

పేదల్ని చంపుతున్న ఆకలి బాధలు తెలియని ఎమ్మెల్యేలు

janasna 15

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను 5 నెలలు వదిలేసి, 50 మందిని చంపేసి ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేస్తున్నారని ఇదేం చోద్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళగిరి లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల  ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేనాని ప్రసంగించారు. ఈ రోజున మీకు భోజనాలు పెడుతున్నామంటే భోజనానికి దిక్కు లేక కాదు, నాకు ఏడుపొచ్చి మీకు అండగా మేము ఉన్నాం అని చెప్పడానికే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మీకు వేరే ఎక్కడొక చోట ఆహరం లభించొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీకు మేము అండగా ఉన్నాం అని చెప్పడానికే ఈ ఆహార శిబిరాలను ఏర్పాటు చేసాం అని ఆయన అన్నారు. ఒక పక్కన ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆత్మస్తైర్యం తీసేసి, ఆత్మహత్యలకు గురిచేసేలా చేస్తుంటే..మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు మేము అండగా ఉన్నాం అని చెప్పడానికి ఈరోజు ఆహార శిబిరాలు ఏర్పాటు చేశాం. 151 సీట్లు ఇచ్చిన వైసీపీ విధివిధానాల వల్ల ఎందుకు మనకి పని దొరకట్లేదు అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో మనకెందుకు అని చేతులు కట్టుకుని కూర్చుంటే ఒక్కొక్కడు తల మీద ఎక్కి తైతెక్కలు ఆడతారు. తైతెక్కలు ఆడేవాళ్ళని తల మీద నుండి దింపి నేలకేసి కొట్టాలి. అద్భుతమైన మెజారిటీ వచ్చిన ప్రభుత్వాన్ని తిట్టడానికి నేను మీలా రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదు. చాలా వేదనతో రాజకీయాల్లోకి వచ్చినవాడిని. సగటు మనిషి వేదనలు తగ్గాలి అని భావనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం సరిగ్గా పాలన అందిస్తే చప్పట్లు కొట్టి అభినందిస్తాను అని ఆయన తెలిపారు.

Related posts

ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తాం

mamatha

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సందర్శించిన ఉత్తమ్

Satyam NEWS

21వ తేదీన మద్యం దుకాణాల వేలం

mamatha

Leave a Comment

error: Content is protected !!