అనారోగ్యంతో బాధపడుతున్నవారిని నేనున్నానంటూ అదుకోవడానికి ముందుకు వస్తున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మరొకరికి ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు ఇప్పించారు. కోడేర్ మండలం నాగుల పల్లి తండాకు చెందిన బాలు నాయక్ కుమారుడు శ్రీను నాయక్ అనారోగ్యంతో బాధపడుతు సికింద్రబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ లో చేరాడు. అతని చికిత్స ఖర్చుల కొరకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 4,00,000 (నాలుగు లక్షల రూపాయల) LOC ని బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందచేశారు. నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి బాలు నాయక్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.