Slider చిత్తూరు

మోడల్ ఎమ్మెల్యే: గిరిపుత్రుల ఆకలి తీరుస్తున్న మధన్న

#Srikalahasthi MLA

పట్టణ ప్రాంతాలలో ఇప్పటి వరకూ నిత్యావసర వస్తువులు అందించి ప్రజలకు అండగా నిలిచిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇప్పుడు అటవీ ప్రాంతంలోని వారికి కూడా సాయం అందిస్తున్నారు. శ్రీకాళహస్తి చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే వెళ్ళని ప్రదేశాలకు వెళ్లి సహాయం చేస్తున్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సదాశివపురం, కుక్కలగుంట , పాయల్ సెంటర్, గుల్లకండ్రిగ సెంటర్, కందాడు సెంటర్ అటవీ ప్రాంతంలో ఉంటాయి. అక్కడ లాక్ డౌన్ సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సుమారు 30 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో ఆయన స్వయంగా వెళ్లి సాయం అందించారు.

 మొదటగా ట్రాక్టర్ లో వెళ్లి, అక్కడ నుండి మరికొంత దూరం ఎద్దులబండిలో వెళ్లి, అక్కడ నుండి దట్టమైన అడవిలోకి కాలినడకన ఆయన వెళ్లారు. దాదాపు 225 కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు అందచేశారు.

అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి జీవనోపాధి సాగించలేక అక్కడి గిరిపుత్రులు అక్కడే పండుతున్న గడ్డలను ఉడకబెట్టి తేనెలో అద్దుకునీ తిని ఎండ వాన సైతం ఎదుర్కొని చిన్ని గుడిసెలో నివసిస్తూ వారి ఆకలిని తీర్చుకుంటున్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమకు సాయం చేయడంతో వారు చేతులెత్తి మొక్కుతున్నారు.

Related posts

త్వరలో నూతన ఏపీ టెక్స్ టైల్ పాలసీ

Satyam NEWS

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాకు

Satyam NEWS

జనవరి 3,4 తేదీల్లో ఏఐటీయూసీ మహాసభలు

Satyam NEWS

Leave a Comment