మహారాష్ట్ర, హార్యానా లో బీజేపీ ఓట్లు సీట్లు బాగా తగ్గడం సంతోషించదగిన పరిణామమని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ రెండు రాష్ట్రాల లో కాంగ్రెస్ ఆశించిన ఫలితం రాకపోయినా గతంలో కంటె ఓట్లు, సీట్లు పెరిగాయని ఆయన అన్నారు. బెదిరింపులు ,ప్రలోభాలు ,సెంటిమెంట్ ఎల్లప్పుడూ పనిచేయవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించినా ప్రజలు పట్టించుకోలేదని పొన్నాల అన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం మాత్రమే కాదని, బడుగుల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నో ఉప ఎన్నికల ను ఎదుర్కొంది, ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అందువల్లే హుజూర్ నగర్ లో ఇలాంటి ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. గత ఉప ఎన్నిక కు భిన్నంగా ఈ ఎన్నిక జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నిక ఓటమితో కాంగ్రెస్ కృషించిపోదు..కార్యకర్తలు అధైర్య పడాల్సి అవసరం లేదు అని పొన్నాల అన్నారు.
previous post