26.2 C
Hyderabad
May 10, 2024 22: 48 PM
Slider మహబూబ్ నగర్

అత్యవసరాలకు ఆన్ లైన్ ద్వారా లాక్ డౌన్ పాసులు

#SP Nagarkarnool

అత్యవసర పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిదలచిన వారు  లాక్ డౌన్ పాసుల కోసం ఆన్ లైన్ సేవలు వినియోగించుకోవచ్చునని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్  వై సాయి శేఖర్ వెల్లడించారు. ఇక నుండి ప్రజలు అత్యవసర పనుల నిమిత్తం లాక్ డౌన్  పాస్ లు పొందేందుకు నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఈ పాస్ విధానం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా అత్యవసరాల కోసం, ఎక్కడైనా చిక్కుకున్న కార్మికులతో పాటు అత్యవసర వైద్య చికిత్సల గురించి ఇబ్బందులు పడుతున్న వారికి సులువుగా పాసులు అందించడానికి తెలంగాణ రాష్ర్ట పోలీసు ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. https://www.tspolice.gov.in/  ఈ website లో https://tsp.koopid.ai/epass  link లింక్ ద్వారా ఆన్లైన్లో ఈ-పాసులు కావాల్సిన వ్యక్తులు అవసరమైన ధృవీకరణ పత్రాలు జత చేసి పంపాల్సి ఉంటుంది.

ఇలా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన అనంతరం పాస్ మంజూరు చేస్తామని, వాటిని అత్యంత సులభంగా ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చునని ఎస్పీ తెలిపారు.

https://www.tspolice.gov.in/

Related posts

సమష్టి కృషితో సర్వతోముఖాభివృద్ధి: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

Satyam NEWS

కోవిడ్ 19 ఎదుర్కొనడానికి సర్పంచ్ లు ముందుకు రావాలి

Satyam NEWS

నరసరావుపేట పరిసరాల్లో ఆలయాల అభివృద్ధికి విజ్ఞప్తి

Satyam NEWS

Leave a Comment