దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో 2020 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2020’ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రవేశ ప్రకటనను అందుబాటులో ఉంది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. డిసెంబరు 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది అని సంస్థ పేర్కొంది. ఇక పరీక్ష షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మే 3న నీట్(యూజీ)-2020 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
నీట్ పరీక్ష హాల్ టికెట్లను మార్చి 27 నుంచి అందుబాటులో ఉంచుతారు. పరీక్ష ముగిసిన నెలరోజుల్లో అంటే జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటి వరకు ఎయిమ్స్, జిప్‌మర్ సంస్థలు ఎంబీబీఎస్/ బీడీఎస్ ప్రవేశాలకు విడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాయి. కానీ ప్రస్తుతం వాటిని కూడా నీట్ పరిధిలోకి తీసుకోబోతున్నారు.