అతనికి చేతులు లేవు, కాని అతను ఒక గొప్ప చిత్రకారుడు. కేరళకి చెందిన ప్రణవ్ దివ్యాంగుడైనా దివ్యమైన చిత్రాలను కాళ్లతోనే వేస్తాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, కేరళ సీఎంతో పాటు పలువురు స్కెచ్‌లని అద్భుతంగా వేసి ప్రణవ్ శభాష్ అనిపించుకున్నాడు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ని స్వయంగా కలిసి ఆయనకి తను వేసిన స్కెచ్‌ని బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన రజనీకాంత్ ఎంతో సంతోషించి ప్రణవ్‌తో కాసేపు సరదా సమయాన్ని గడిపారు. ప్రస్తుతం రజనీకాంత్, ప్రణవ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.