40.2 C
Hyderabad
April 28, 2024 18: 12 PM
Slider విశాఖపట్నం

పి.ఎఫ్ డబ్బులను దోచుకున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి

#AITUC

క్లిన్ ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛసంకల్ప పథకంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి భయంకరమైన రోగాలని సైతం లెక్కచేయక తడి చెత్త పొడి చెత్తని సేకరించి పని చేస్తున్న క్లాప్ వెహికల్ డ్రైవర్ల ప్రావిడెంట్ ఫండ్ ( పి.ఎఫ్ ) డబ్బులను కాంట్రాక్టర్లు దోచుకు తినేస్తున్నారని ఏఐటీయూసీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

క్లాప్ వెహికల్ డ్రైవర్ల పీ.ఎఫ్ డబ్బులు కాజేస్తున్న కాంట్రాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏ.పి. స్వచాంద్ర క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ( ఏఐటియూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం పి.ఎఫ్ కార్యాలయం దగ్గర యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ అధ్యక్షతన నిరసన ధర్నా చేయడం

జరిగింది. అనంతరం బుగత అశోక్ మీడియా తో మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కష్టపడి పనులు చేస్తున్న డ్రైవర్ల శ్రమని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని బుగత అశోక్ ధ్వజమెత్తారు. జీతానికి తగినట్టుగా పి.ఎఫ్ చెల్లింపులు జరగడం లేదన్నారు. అందులో జరుగుతున్న అవకతవకలను తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని సరిచేయకపోతే పి.ఎఫ్ చెల్లింపుల్లో పెద్ద దోపిడీ జరుగుతుందని తెలిపారు.

డ్రైవర్లకి ప్రమాదం జరిగిన, ఏదయినా రోగం వచ్చిన వైద్యం చేయించుకోడానికి ఈఎస్ఐ అమలులో ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఈఎస్ఐ కార్డులు ఇవ్వలేదన్నారు. వారానికి ఒక్క రోజు కూడా శెలవు లేకుండా శ్రమిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డ్రైవర్లతో చాకిరీ చేయించుకుని కనీసం కనికరం కలగడం లేదా అని మండిపడ్డారు.

మాకు న్యాయం చేయండి అని అడిగేవారిని విచక్షణారహితంగా ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని బ్లాక్మైల్ చేస్తున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకుండా ఉండటం దారుణమన్నారు.

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న శాంతియుత ఉద్యమం ఉధృతం కాకముందే అధికారులు కలుగుచేసుకుని సమస్యలు పరిష్కరించి సామరస్య వాతావరణం కల్పించకపోతే తరువాత జరగబోయే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని బుగత అశోక్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు కాళ్ళ అశోక్, సంతోష్, సహాయ కార్యదర్సులు ఏ. శ్రీనివాసు, కె రవి, కోశాధికారి ఆర్. సౌరి లతో పాటు విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్లో 60 సచివాలయ పరిధిలో పని చేస్తున్న డ్రైవర్లు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన జర్నలిస్టులకందరికీ అక్రిడిటేషన్ సౌకర్యం

Satyam NEWS

శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

వేపాడ జేడ్పీ ఉన్న‌త‌పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా సంద‌ర్శించిన విజయనగరం క‌లెక్ట‌ర్

Satyam NEWS

Leave a Comment