38.7 C
Hyderabad
May 7, 2024 17: 46 PM
Slider గుంటూరు

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

#dr.chadalawada

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. గత ఏడాది మిర్చి రైతులకు ధరలు కొంచెం ఊరటనివ్వడంతో ఈ ఏడాది అత్యధికంగా నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, ప్రత్తిపాడు పెదకూరపాడు లో అధిక శాతం రైతులు మిర్చి సాగు వైపు మొగ్గు చూపారని ఆయన అన్నారు.

ప్రస్తుతం మిర్చిలో ముడత బొబ్బర తెగుళ్లు, పత్తిలో కాయ కుళ్ళుడు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, ఉధృతితో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు. నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డా౹౹చదలవాడ డిమాండ్ చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, మళ్ళీ పంటల సాగు చేసుకునేందుకు  రాయితీ పై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. వరి సాగుకు తప్ప ఇతర పంటలు పండిచేందుకు వీలులేని భూములు కలిగిన రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు.

రైతు భరోసా కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయని రైతులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వడంలో వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ క్రాప్ చేయాలంటే భూమి వెబ్ ల్యాండ్ లో ఉండాలనే నిబంధనలు పెట్టడంతో ఈ క్రాప్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు కాగితాల పై లెక్కలు చూపడం కాకుండా క్షేత్ర స్థాయిలో పంటలు పరిశీలించి ఎటువంటి నిబంధనలు లేకుండా పార్టీలకతీతంగా పంట నష్టం పై అంచనా తయారు చేయాలని మిర్చికి రూ.1లక్ష పత్తి మొక్కజొన్నకు రూ.35 నుండి 40.వేలు వరకు తక్షణ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో టిడిపి ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలని స్థానిక సంబంధించిన అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన్ బాబు, రాష్ట్ర రైతు కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు, గుర్రం నాగ పూర్ణచంద్రరావు,నరసరావుపేట పార్లమెంట్ రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, నరసరావుపేట రైతు నాయకులు యమలయ్యా, మందలపు వెంకట్ రత్నం, కోడె హనుమంతరావు, పులిమి రామిరెడ్డి, పార్లమెంట్ మహిళా విభాగం నాయకురాలు లీలావతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగులో తప్పు మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తున్నారు

Satyam NEWS

జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు

Satyam NEWS

వసూళ్లకు పాల్పడ్డ మంత్రి పిఆర్వో పై వేటు

Satyam NEWS

Leave a Comment