24.7 C
Hyderabad
May 17, 2024 01: 58 AM
Slider ముఖ్యంశాలు

పలు జిల్లాలకు రెడ్ వార్నింగ్

#Red warning

ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో రెడ్ వార్నింగ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.

అలాగే ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, మేడ్చల్, మహబుబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ జిల్లాలో ఎల్లో వార్నింగ్ ఆదేశాలు జారీ చేశారు. చత్తీస్‌ఘడ్ ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల్లో మర్జ్ అయ్యిందని, ఈ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న మూడు రోజులు కురిసే అవకాశం కన్పిస్తుందని తెలిపారు.

అలాగే వర్షాలు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీమ్, మంచిర్యాల ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.మోస్తారు నుంచి భారీ వర్షాలు యాదాద్రి, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ప్రాంతాల్లో ఉండే అవకాశాలన్నాయని వెల్లడించారు.

మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మోస్తారుతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుతున్నప్పటికి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో గాలి తీవ్రత ప్రతి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లకు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

Related posts

రాహుల్ యాత్ర: కాంగ్రెస్ కు కలిసివచ్చిందా?

Bhavani

విశ్వవిఖ్యాత గాయకుడిని పిలిచి అవమానించిన ప్రధాని మోడీ

Satyam NEWS

వైసీపీ రేబిస్ వచ్చిన కుక్క… అందరూ కలిసి తన్ని తరిమేయాలి

Satyam NEWS

Leave a Comment