38.2 C
Hyderabad
April 29, 2024 21: 11 PM
Slider జాతీయం

జైపూర్ లో కంపించిన భూమి

#Earthquakes

రాజస్థాన్ కేపిటల్ సిటీ జైపూర్‌లో శుక్రవారం వేకువ జామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్క సారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.4గా నమోదైంది. 10 కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు సిస్మాలజీ సెంటర్ అధికారులు తెలిపారు.

నిద్రమత్తులో ఉన్న ప్రజలు భూమి కంపించడంతో వీధుల్లోకి పరుగున వచ్చారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గురువారం తెల్లవారు జామున మిజోరంలోని నొగాపాలో సైతం భూమి కంపించింది.

అయితే రాజస్థాన్ లో భూమి కంపించడంపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈ భూకంపం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇతర ప్రాంతాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించిందన్నారు

Related posts

మోడీ ,కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించుకోవాలి

Satyam NEWS

ఫ్యామిలీ క్లాష్: మద్యం మరణాలు మొదలు

Satyam NEWS

నరసరావుపేట లో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

Bhavani

Leave a Comment