30.2 C
Hyderabad
May 17, 2024 16: 38 PM
కవి ప్రపంచం

సంతోష శుభకృత

#Dr.S.VijayaBhaskar

శుభకృత నామ సంవత్సర ఉగాది

తెలుగు వారి నూతన సంవత్సర ఉగాది

సంస్కృతి, సంప్రదాయాల పెన్నిధి

షడ్రుచులు, పిండివంటల సన్నిది

దేవాలయాలన్ని భక్తులతో,  పంచాగ పఠనాలతో సందడి

మామిడి పిందెలు,వేప పువ్వు, చింతపండు, బెల్లం తో చేసిన పచ్చడి

వసంత కాలంలో కోకిల కూతలు

యువతి, యువకుల కేరింతలు

ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుకలు

పల్లె, పట్నం తేడా లేక  మామిడి తోరణాలు, పూలదండలతో ‌ఉత్సవాలు

గతంలోని కరోనా వైరస్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో నిరాశ, నిస్పృహలు

ఈ శుభకృత నామ సంవత్సరంలో

అన్ని శుభాలు, సంతోషాలు

డాక్టర్.  ఎస్.  విజయ భాస్కర్, సైదాబాద్ హైదరాబాద్-59, 9290826988

Related posts

అమ్మోరుతల్లి

Satyam NEWS

వర్ణరంజితం పల్లె దారి

Satyam NEWS

నిశ్శబ్ద విప్లవం

Satyam NEWS

Leave a Comment