37.2 C
Hyderabad
April 30, 2024 12: 04 PM
Slider కవి ప్రపంచం

అమ్మోరుతల్లి

#Ganji Kalavathi Nalgonda

తెలంగాణలోన ఆషాడమాసాన

అమ్మోరుతల్లి అవనికి దిగివచ్చే

మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ

డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మా

ఏపేరుతో పిలిచినా పలికేది దుర్గనే

మట్టికుండలోన పాలు పెరుగు బెల్లముతోను

బోనమొండి తేవంగ అమ్మ ఆరగింపగవచ్చె

ఆడపడచులంత పట్టుచీరలుగట్టి నగలెన్నోపెట్టి

ముత్తైదువుతనంతో గుంపుగాచేరి

కుండకు నిండుగా పసుపుకుంకుమరాసి

అమ్మోరు రూపును అందముగదిద్ది

వేపాకు రెమ్మలను బోనానికిచుట్టి

బతుకువెలుగు నిచ్చు దీపాన్ని వెలిగించి

తలపైన తీరుగా బోనమెత్తుకుని

భక్తిపరవశము తోను భధ్రంగతెచ్చి

అమ్మోరుతల్లికి నైవేద్యమర్పించి

ఆపైన కోళ్ల ను మేకలను బలియిచ్చి

ఆరోగ్యం సంపద సుఖశాంతులిమ్మనీ

అమ్మోరుతల్లిని ఆర్తితోవేడగా అమ్మ శాంతించి

సంతోషించీ అడిగినవన్ని ఇచ్చి ఆనందపరచె

ఒళ్ళంతా పసుపుకుంకుమతోను అమ్మసోదరుడు పోతరాజు రంగమాడంగ చూడ కన్నులపండుగే

గోల్కొండలోన ఎల్లమ్మగ మొదలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తల్లిగ

జూబ్లీహిల్స్ లో పెద్దమ్మతల్లిగ

పాతబస్తీలో లాల్దర్వాజ సింహవాహిని మాతేశ్వరితల్లిగ

జగతినేల వచ్చె జగదాంబికామాతగ

గోల్కొండకోటలో ఆఖరి పూజలందుకుని

బిడ్ఢలను రక్షింప గ్రామ దేవతయై

ఊరి పొలిమేరలలోన కొలువుండె మాయమ్మ

గంజి కళావతి  శ్రీనివాస్, నల్లగొండ, 9912589703

Related posts

బీజేపీ పెట్టిన పోస్టులపై కాంగ్రెస్ నిరసన…!

Satyam NEWS

తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు

Bhavani

సహజసిద్ధమైన పండ్లను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

Satyam NEWS

Leave a Comment