29.2 C
Hyderabad
May 18, 2024 11: 34 AM
Slider ఖమ్మం

మానవ నిత్య జీవితంలో సైన్స్​ పాత్ర ఎంతో ఉంది

#ajay

నేటి జీవన విధానంలో మానవ నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో ఉందని, విద్యార్థి దశ నుండే వారిలోని సృజనాత్మకను, నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి పాఠశాలలో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా 650 మంది విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల వైజ్ఞానిక యంత్రాలు, పరికరాలు సందర్శించారు. వారి ప్రతిభను చూసి మంత్రి అబ్బురపడి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతోందని అన్నారు. విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళికి ఉపయోగపడే పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసేలా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని, వాటిని అధిగమించేందుకు కష్టపడి చదివి గొప్ప స్థాయికి ఎదగాలన్నారు.

అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని, మిస్సైల్ మ్యాన్ గా ఎదిగి, ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం మనందరికీ స్పూర్తిదాయకమన్నారు. సమాచారం, కమ్యూనికేషన్‌ టెక్నాలజీలో పురోగతి, పర్యావరణహితమైన పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా-ఆవిష్కరణలు, పర్యావవరణం-సుస్థిర మార్పులు, ప్రస్తుత ఆవిష్కరణతో చారిత్రాత్మక అభివృద్ధి, మనకోసం గణితం అనే అంశాలు విద్యార్థులు అద్భుతంగా ఆవిష్కరించారు అన్నారు. విద్యార్థులు సంవత్సరమంతా చేసిన పనిని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదిక అని, ఇది విద్యార్థులలో ప్రేరణ కల్పిస్తుంది, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని తెలుసుకునే పరిపుష్టిగా ఉంటుందన్నారు. విద్యార్థులు తాము చేసిన పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ భావనలపై అవగాహన పెరుగుతుందని, అనేక నమూనాల ప్రదర్శనను చూసిన విద్యార్థులకు తాముకూడ ఇలాంటి ప్రదర్శనలో భాగస్వాములు కావాలన్న భావన కలుగుతుందన్నారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన ను మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వారికి మనం చేయూతనిస్తు ప్రోత్సహించి వారి లక్ష్యాలను చేరేలా మన వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంస పాత్రలు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , కలెక్టర్ అనుదీప్ , ఎస్పీ వినిత్ , డిసిసిబి చైర్మన్ నాగభూషణం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

Bhavani

యాక్సిడెంట్ :ఖమ్మంలో ఇద్దరి మృతి 5గురికి గాయాలు

Satyam NEWS

Leave a Comment