బుధవారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దిమ్మెను ఢీకొట్టింది.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను రాజమండ్రికి చెందిన కమలంపూడి సూర్‌రెడ్డి(66), హేమంత్ రెడ్డి (8)లుగా గుర్తించారు. సూర్ రెడ్డి కుటుంబం మంగళవారం కర్ణాటకకు పని నిమిత్తం వెళ్లి తిరిగి రాజమండ్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సూర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా. కారులో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.