28.7 C
Hyderabad
May 6, 2024 07: 16 AM
Slider ఖమ్మం

భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి

#collector

భవన నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్, పోలీస్ స్టేషన్ నూతన భవనాల నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. భవన ప్లాన్ ను కలెక్టర్ పరిశీలించారు.  తహసీల్దార్ కార్యాలయ భవనం రెండు నెలల్లో పూర్తికానున్నట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. రికార్డు రూమ్, పబ్లిక్ టాయిలెట్స్, అదనపు గదులు ఉండేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్ భవనంలో వాష్ రూం, వెయిటింగ్ షెడ్లు, రిషిప్షన్, ఫెలిసిటేషన్ సెంటర్, పార్క్ కు ప్రణాళిక చేయాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. భవనానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలు,  లైన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.  కలెక్టర్ తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఏసీపీ బస్వారెడ్డి, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, రఘునాథపాలెం మండల తహసీల్దార్ నర్సింహారావు, జెడ్పిటిసి ప్రియాంక, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

చేత‌న్ చీను ‘విద్యార్థి’ షూటింగ్ పూర్తి

Sub Editor

ప్రైవేట్ అధ్యాపకులను, నిరుద్యోగులను ఆదుకోవాలి

Satyam NEWS

ప్రోగ్రెస్:పెద్దపాడు ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment