24.7 C
Hyderabad
May 13, 2024 05: 03 AM
Slider ప్రత్యేకం

యూనియన్ బ్యాంకు బంగారం మాయం: ఖాతాదారుల ఆందోళన

Union Bank

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి ప్రాంతంలోని రెంటపాళ్ల గ్రామంలో ఆంధ్రాబ్యాంక్ ఇటీ వల యూనియన్ బ్యాంకుగా మారింది.ఈ బ్యాంకులో సుమారు వేల సంఖ్యలో ఖాతాలు ఉన్నాయి. ఈ గ్రామంలో రైతులు అధిక సంఖ్యలో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయానికి రుణం తీసుకుంటారు.అయితే తాజాగా ఈ బ్యాంకులో పనిచేసే గోల్డ్ అప్రయిజర్ ఇమ్మిడిశెట్టి .సంపత్ కుమార్ బంగారాన్ని భద్రపరచాల్సింది పోయి మాయం చేశారు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బ్యాంకు సిబ్బంది ఉలిక్కిపడ్డారు.మొత్తం 43 బ్యాగ్లలో రూ.1.70 కోట్ల విలువ చేసే బంగారాన్ని మాయం చేశారు. దీనిపై బ్యాంకు ఉన్నతాధికా రులు స్పందించి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్ మేనేజర్ రాంబాబు నాయక్, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు.బంగారాన్ని తిరిగి తీసుకురావాలని గోల్డ్ అప్రయిజర్ సంపత్ కుమార్కు మూడు రోజులు సమయం ఇచ్చారు.

ఈ విషయం తెలిసిన రైతులు ఒకపక్క ఆందోళన వ్యక్తం చేస్తుండగా మరో వైపు సస్పెన్షన్కు గురైన మేనేజర్ తక్షణమే బంగారం తీసుకురాక పోతే ఆత్మహత్య చేసుకుంటానని గోల్డ్ అప్రయిజర్తో మొర పెట్టుకుంటున్నాడు.దీనిపై జిల్లా తమకు బ్యాంక్ లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న జిల్లా జోనల్ ఆఫీస్ అధికారులు.

తనకు సంబంధం లేదంటున్న గోల్డ్ అప్రైజర్

తనకు ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని,ప్రతీ రోజు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు సిబ్బందికి అప్పజెప్పటం మాత్రమే తన విధని, బంగారం మాయం కావటం వెనుక వాస్తవాలు ఉన్నతాధికారులు విచారణలో బయటకు వస్తాయని గోల్డ్ అప్రయిజర్ సంపత్ కుమార్ వెల్లడించారు.

Related posts

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

Satyam NEWS

మల్దకల్ లో అన్నదాత ఆత్మీయ సంబరాలు ప్రారంభం

Bhavani

డిసెంబర్ లో సెట్స్ కి వెళ్తున్న “డ్యూడ్”

Satyam NEWS

Leave a Comment