33.7 C
Hyderabad
April 29, 2024 02: 48 AM
Slider గుంటూరు

చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ కోవర్టు ‘ స్కిల్ ‘

#Amaravati Bahujan

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ కోవర్ట్ స్కిల్ ఆపరేషన్ దాగి ఉందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. రాజ్యాంగ విలువలు, హక్కులు, కోర్టుల ఆదేశాలు, వ్యవస్థల పనితీరును గౌరవించాల్సిన ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థల లోకి తన కోవర్టు మనుషుల్ని పెట్టుకొన్నారన్నారు.

పోలీసు, పరిపాలన, ప్రతిపక్ష పార్టీలలోనూ తన ‘ఆపరేషన్ ధనుష్’ మనుషులను పెట్టుకొని రాజ్యాంగేతర శక్తిగా బలపడ్డారని అన్నారు. రాజధాని ఉద్యమం రాజధానికే పరిమితం కావటంలోనూ, విశాఖ ఉద్యమం విశాఖ కే పరిమితం కావటంలోనూ వైసీపీ డైరెక్షన్ ఉందన్నారు. వీరంతా ఆయా ఉద్యమాలు బలపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, ఎక్కడి కక్కడ కట్టడి చేస్తారని తెలిపారు.

స్కిల్ డెవలప్మెంట్, ఔటర్ రింగ్, ఎసైన్డ్ భూములు, పుంగనూరు అల్లర్లు అన్నింటిలోనూ తన చెప్పు చేతల్లో ఉండే నాయకులను, అధికారులను, న్యాయకోవిదులను నియమించుకున్నారన్నారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య, పార్టీల మధ్య, మేధావుల మధ్య విభజన రేఖలు గీశారు అన్నారు.

నిజానికి చంద్రబాబుకు వ్యవస్థలను వాడుకోవడం, పాదాక్రాంతం చేసుకోవడం తెలియదని, అలా తెలిసిన నాయకుడైతే, తాడూ బొంగరం లేని కేసులో జైలుకు పోడని పేర్కొన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, వాడుకోవటం జగన్ కే బాగా తెలుసు అని పేర్కొన్నారు.

ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్దన్ రెడ్డితో పాటు గనులను అక్రమంగా అప్పగించిన ఐఏఎస్ అధికారులు శ్రీ లక్ష్మీ, ఆచార్యలను కూడా అప్పటి సీబీఐ అరెస్టు చేసిందని, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పాత్ర ఉన్న అధికారులను సిఐడి ఎందుకు వదిలేసిందన్నారు. విధాన నిర్ణయంగా తీసుకున్న నిర్ణయంలో అప్పటి క్యాబినెట్ , అసెంబ్లీ, అపోజిషన్, సిఎస్ ఇతర అధికారులంతా భాగస్వాములేనని చెప్పారు.

ఈ కేసులో అసలు ఫైల్ కనిపించడం లేదని, షాడో ఫైల్ ఆధారంగా కేసు పెట్టారనే మాటలను బట్టి కేసు ఉద్దేశపూర్వకంగా, కుట్ర గా జరిగిందన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఏ డబ్బులు అయినా చెట్లకు కాయవని, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ తోనే లావాదేవీలు జరగాలని, సంబంధిత అధికారుల అనుమతి ఉండాలని చెప్పారు.

కేవలం తనకి 6093 నెంబర్ ఇచ్చారు కాబట్టి , తాను కూడా ప్రత్యర్థి పార్టీకి 7691 నెంబర్ ఇవ్వాలన్న ఏకైక ‘పులివెందుల మార్క్ పంచాయితీ’ తోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. కేసులను కోర్టు ల్లో వాయిదాలు వేసి, సాగదీసి 74 ఏళ్ళ చంద్రబాబును మానసికంగా హింసించాలన్నదే ప్రభుత్వ కక్ష గా తేల్చి చెప్పారు.

మరో కొద్ది రోజుల్లో అచ్చం నాయుడు, లోకేష్ లను కూడా అరెస్టు చేస్తారని ఆరోపించారు. ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోడీ కనుసనల్లో జరుగుతున్న కార్యక్రమాలు గా చెప్పారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల పై తాము పౌరసమాజం తరఫున పోరాడుతున్నామని, ప్రజలే రాష్ట్రాన్ని , శాంతి భద్రతలను చంద్రబాబును కాపాడుకోవాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు.

Related posts

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కోసం వనపర్తి జిల్లా సిద్ధం

Satyam NEWS

పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

Leave a Comment