Slider జాతీయం

తనంతట తానే వైదొలగిన మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్

608300-fadnavis-devendra-072817

మహారాష్ట్ర రాజకీయాలలో బిజెపికి శృంగ భంగమైంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు రేగాయి. దీన్ని ఖరారు చేస్తూ ఉప ముఖ్యమంత్రి, ఎన్ సి పి బహిష్క్రత నేత అజిత్ పవర్ తన పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నివాసంలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం బీజేపీ తన ఎమ్మెల్యేలకు విప్‌ జారిచేసింది. రేపటి బలపరీక్షలో విజయం సాధిస్తామని బీజేపీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్‌ నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ భేటీ అయ్యారు. ముంబైలోని లెమన్‌ ట్రీ హోట్‌లో శివసేన నేతలు, మరియట్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలు సమావేశమై.. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అయితే మధ్యాహ్నం నాటికి పూర్తి చిత్రం క్లియర్ కావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా ఇచ్చారు.

Related posts

డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై నిరసన

Satyam NEWS

టి ఎస్ ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించలేం

Satyam NEWS

నేరాన్ని బయటపెట్టిన గూగుల్ ఎర్త్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!