28.2 C
Hyderabad
May 17, 2024 13: 02 PM
Slider ముఖ్యంశాలు

ఘనంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ అధ్యక్షతన నల్లగొండ పార్లమెంటు సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్పీ క్యాంపు స్కూల్ లో ప్రైమరీ బాల,బాలికలకు నోట్ బుక్స్, పలకలు,పెన్నులు పంపిణీ చేసి చిన్నారుల సమక్షంలో భారీ కేకుతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,మాజీ జడ్పీటిసి గల్లా వెంకటేశ్వర్లు,బాచిమంచి గిరిబాబు, కౌన్సిలర్ తేజావత్ రాజా నాయక్,పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, గొట్టేముక్కుల రాములు,కోల్లపూడి యోహాన్,వార్డు కమిటీ అధ్యక్షులు పోతనబోయిన రామ్మూర్తి,పోతుల జ్ఞానయ్య,అంజనపల్లి సుదర్శన్,సంక్రాంతి కోటేశ్వరరావు,కోల మట్టయ్య,బంటు సైదులు,చింతకాయల రాము,యూత్ కాంగ్రెస్ ఎస్సీ సెల్,మైనారిటీ కమిటీ అధ్యక్షుడు రేడపంగు రాము,కస్తాల సైదులు,ఎస్.కె ఉద్ధండు,ఎస్.కె ఫరీద్, గడ్డం అంజయ్య,కుక్కడపు వీరబాబు, తదితర నాయకులు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గన్ని 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో నడిపి రాష్ట్రం లోనే ఒక గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు.నేడు ఉన్న నాయకులు అభివృద్ధిని అట్టకెక్కించి ప్రచార ఆర్భాటాలతో దశాబ్ది ఉత్సవాలని  ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి కనబడుతుందని అన్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యున్నత స్థాయి పదవుల్లో ఉండటం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యజపతిరావు, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చిన కవిత

Satyam NEWS

టీకాలు వేయించుకోని విద్యార్ధులను స్కూళ్లలోకి రానివ్వరు

Satyam NEWS

జోడి చిత్రం విడుదల తేదీ ఖరారు

Satyam NEWS

Leave a Comment