34.2 C
Hyderabad
May 11, 2024 21: 46 PM
Slider ప్రత్యేకం

టీకాలు వేయించుకోని విద్యార్ధులను స్కూళ్లలోకి రానివ్వరు

#coronavaccination

కరోనా టీకాలు వేయించుకోని 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న టీనేజర్లను పాఠశాలల్లోకి అనుమతించేది లేదని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. గత పక్షం రోజులుగా కరోనా కేసులు భారీగా పెరగడంతో హర్యానా రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ వారికి టీకాలు వేయించాలని మంత్రి కోరారు. పాఠశాలలు తెరిచినప్పుడు, టీకాలు వేయని వారిని పాఠశాలలోకి అనుమతించేది లేదని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. హర్యానాలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 15 లక్షల మంది ఉన్నారు. ఈ వయస్సు వారికి కరోనా టీకాలు వేయడం జనవరి 3 నుండి ప్రారంభించారు.

Related posts

బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి

Satyam NEWS

సేక్రెడ్ గాడ్: వన దేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

Satyam NEWS

ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..

Sub Editor

Leave a Comment