30.2 C
Hyderabad
May 17, 2024 15: 11 PM
Slider శ్రీకాకుళం

అంగన్‌వాడీ భవన స్థలం ఎవరు కేటాయించారు?

#Anganwadi building

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో దళితులకు ఇందిరాగాంధీ హయాంలో 3.51 ఎకరాల భూమిని దళితుల ఇళ్ల కోసం కేటాయించి 32 మంది దళితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, మిగిలిన రెండున్నర ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమించుకుంటున్నారని తమ్మినాయుడుపేట గ్రామానికి చెందిన దళితులు ఆర్డీఓ బొడ్డేపల్లి శేషశైలజకు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు.

ఇటీవల అంగన్‌వాడీ భవన నిర్మాణం కోసం ఎవరి అనుమతి లేకుండా 2016లో స్థలం కేటాయించినట్లు అంగన్‌వాడీ టీచర్‌ ఆ గ్రామ పెద్దలకు మంజూరుపత్రం చూపించడంతో దళితులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంగన్‌వాడీ భవన నిర్మాణం కోసం ఆదివారం మార్కింగ్‌ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని దళితులంతా అక్కడికి చేరుకోవడంతో అంగన్‌వాడీ టీచర్‌ దళితులతో వాగ్వివాదానికి దిగారు.

దీంతో తహశీల్దార్‌కు, ఐసీడీఎస్‌ పీఓను సంప్రదించగా తమకు సంబంధం లేదంటూ తప్పించుకున్నారు. చేసేది లేక గ్రామానికి చెందిన దళితులంతా దళిత సంఘాల నాయకులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడంతో సోమవారం ఆర్డీఓ దళిత కన్వీనర్‌ డాక్టర్‌ కంఠ వేణు ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తూ తమకు జరిగిన అన్యాయాన్ని దళితులకు వివరించారు.

ఇప్పటికే ఈ స్థలంపై అనేకమంది కళ్లు పడ్డాయని, తమ కుటుంబాల్లో కూడా ఇంటికి ఇద్దరు చొప్పున అన్నదమ్ములు ఉన్నారని, అర్హులైన దళితులకు ఆ స్థలంలో ఇళ్లు మంజూరు చేసి పట్టాలు అందజేయాలని అప్పటి కలెక్టర్‌ అనిల్‌చంద్ర పుణేఠాకు వినతిపత్రం ఇవ్వడంతో ఆయన స్పందిస్తూ ఈ స్థలంలో దళితులకు తప్ప వేరెవ్వరికీ భవనాలు గానీ, ఇళ్ల నిర్మాణాలు గానీ స్థలం ఇవ్వకూడదంటూ అప్పటి ఎచ్చెర్ల తహశీల్దార్‌ను ఆదేశించడంతోపాటు గ్రామ దళితులకు కూడా కలెక్టర్‌ ఒక లేఖను ఇచ్చారంటూ ఆర్డీఓకు వివరించారు.

ఈ స్థలం విషయంలో ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా 32 దళిత కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓను వేడుకున్నారు. ఆర్డీఓను కలిసినవారిలో రాకోటి చిన్నారావు, రాకోటి రాఘవులు, భైరి త్రినాథరావు, అలికాన శ్రీను, తిర్లంగి రామారావు, అలికాన క్రిష్ణతోపాటు 30మంది దళిత కుటుంబాలు పాల్గొన్నాయి.

Related posts

ఇసుక కొరతపై గుంటూరులో లోకేష్ నిరసన దీక్ష

Satyam NEWS

త‌ల్లీ, బిడ్డ‌ల‌ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి: విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్

Satyam NEWS

నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ

Bhavani

Leave a Comment