28.7 C
Hyderabad
April 27, 2024 04: 42 AM
Slider విజయనగరం

త‌ల్లీ, బిడ్డ‌ల‌ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి: విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్

#suryakumari

గ‌ర్భిణులు, , పిల్ల‌ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌ని ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. వారికి త‌ర‌చూ ర‌క్త‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తూ, ర‌క్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు మందులు ఇచ్చి, ఆరోగ్య‌క‌రంగా త‌యారు చేయాల‌ని సూచించారు.

ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించ‌డం ద్వారా ర‌క్తం పెరుగుతుంద‌ని చెప్పారు.ఈ మేర‌కు జిల్లాలోని భోగాపురం,డెంకాడ మండ‌లాల‌లో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ ప‌ర్య‌టించారు.అక్క‌డ గ‌ల‌ సిసి రోడ్ల నిర్మాణాన్ని, హౌసింగ్ కాల‌నీని త‌నిఖీ చేశారు. సిసి రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి  చేయాల‌ని, హౌసింగ్ కాల‌నీలో అన్ని ఇళ్ల నిర్మాణాన్ని వెంట‌నే ప్రారంభించేలా చూడాల‌ని సూచించారు.

బిల్లు పెట్టిన వెంట‌నే మంజూరయ్యే ప‌రిస్థితి ఉంద‌ని, ఈ అవ‌కాశాన్ని ల‌బ్దిదారులు వినియోగించుకోవాల‌ని కోరారు. . జ‌గ‌న‌న్న కాల‌నీలో అవ‌స‌ర‌మైతే సామూహిక మ‌రుగుదొడ్డిని నిర్మించాల‌ని సూచించారు. గ్రామంలో ర‌క్షిత మంచినీటి స‌మీపంలో ఆపారిశుధ్యంపై మండిప‌డ్డారు.

భోగాపురం,డెంకాడ మండ‌లాల్లో ఆక‌స్మికంగా ప‌ర్య‌టించిన క‌లెక్ట‌ర్

స‌వ‌ర‌విల్లి గ్రామ స‌చివాల‌యాన్ని కూడా అప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీ చేసారు..ముందుగా సిబ్బంది హాజ‌రును, రికార్డుల‌ను ప‌రిశీలించి…. గ‌ర్భిణులు, బ‌డిపిల్ల‌ల ఆరోగ్య తనిఖీల‌పై ఆరా తీశారు. ర‌క్త ప‌రీక్ష‌లు చేయ‌క‌పోవ‌డంపై, ఎఎన్ఎంపై ఆగ్ర‌హం  వ్య‌క్తం చేశారు. త‌ర‌చూ రక్త‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, హెమోగ్లోబిన్ త‌క్కువ ఉన్న‌వారికి పోష‌కాహారాన్ని, అవ‌స‌ర‌మైన మందుల‌ను అందించాల‌ని ఆదేశించారు. .

పిల్ల‌లు ఆరోగ్యంగా త‌యారైతే, భ‌విష్య‌త్ త‌రాలు ఆరోగ్యంగా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం నిర్వ‌హ‌ణ‌పై ఆరా తీశారు. స‌రుకుల నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డొద్ద‌ని, గుడ్లు బాగులేక‌పోతే, తిర‌స్క‌రించాల‌ని సూచించారు. ఓటిఎస్ ప‌థ‌కంపై ఆరా తీశారు. ప్ర‌తీఒక్క‌రూ ఈ ప‌థ‌కాన్ని వినియోగించుకొనేలా చూడాల‌న్నారు. హాజ‌రు త‌క్కువ‌గా ఉన్న వ‌లంటీర్ల‌ను తొల‌గించాల‌ని సూచించారు.

క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగంపై స‌చివాల‌య సిబ్బందిని ప్ర‌శ్నించిన క‌లెక్ట‌ర్

అటు గ్రామ‌స‌చివాల‌యాల త‌నిఖీలు,ఇటు ఉపాధి హామీ ప‌నుల క‌న్వ‌ర్జెన్సీ నిధులు వినియోగంపై జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారీ ఆరా తీసారు. ఈ మేర‌కు జిల్లా తూర్పున  ఉన్న భోగాపురం,డెంకాడ మండ‌లాల‌లో విస్త్ర‌తంగా ప‌ర్య‌టించారు.ఈ సంద‌ర్బంగా అక్క‌డ  జ‌రుగుతున్న అభివృద్ది ప‌నులు, ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగంపై స‌చివాల‌య సిబ్బందిని ప్ర‌శ్నించారు.

ఇంకా ప్రారంభించ‌ని ప‌నుల‌ను వెంట‌నే మొద‌లు పెట్టాల‌ని . సిసిరోడ్లు, కాలువ‌ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాల‌న్నారు. క‌న్వ‌ర్జెన్సీ నిధులు సిద్దంగా ఉన్నాయ‌ని, ప‌నులు వెంట‌నే పూర్తిచేసి, బిల్లులు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. గ్రామంలో ప్ర‌కృతి సాగును ప్రోత్స‌హించాల‌ని సూచించారు. సిటిజ‌న్ అవుట్‌రీచ్‌పై ఆరా తీశారు. అర్హ‌లంద‌రికీ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. 104 వాహ‌నం ద్వారా అందిస్తున్న వైద్య సేవ‌లు, వేక్సినేష‌న్‌, టిబి వ్యాధికి చికిత్స త‌దిత‌ర వైద్య సంబంధ విష‌యాల‌పై ప్ర‌శ్నించి, ప‌నితీరు మెరుగుప‌ర్చుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భోగాపురం మండ‌ల తహ‌శీల్దార్ ఎం.ర‌మ‌ణ‌మ్మ పాల్గొన్నారు.

Related posts

పాలమూరు కోడలు వాణిదేవిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలి

Satyam NEWS

రామంతపూర్ లో వైశ్య ఫెడరేషన్ అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

కరోనా నివారణకు పుట్లగట్లగూడెం గ్రామాన్ని శానిటేషన్ చేసిన యువత

Satyam NEWS

Leave a Comment