28.2 C
Hyderabad
May 17, 2024 12: 02 PM
Slider మహబూబ్ నగర్

టీటా, ఏటీఎస్ ఆధ్వ‌ర్యంలో నాలుగో కోవిడ్ ద‌వాఖ‌న‌

#covid davakhana

అమెరిక‌న్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్‌), తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) ఆధ్వ‌ర్యంలో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో ఉత్త‌మ‌మైన వైద్య సేవ‌ల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న కోవిడ్ ద‌వాఖ‌న‌ల్లో నాలుగో ద‌వాఖ‌న ఏర్పాటైంది.

నారాయ‌ణ‌పేట్ జిల్లా  గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎదుర‌వుతున్న చికిత్స స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు హ‌న్వ‌డ మండ‌లం పెద్దాదార్‌ప‌ల్లిలో ఏర్పాటైన ఈ కోవిడ్ ద‌వాఖ‌న‌ను దాత తండ్రి బాల‌రాజు గౌడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ డీఎస్పీ శ్రీ‌ధ‌ర్ గౌర‌వ అతిథిగా విచ్చేశారు. క‌రోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు వ్యాధిగ్ర‌స్తులు చికిత్స పొందే విష‌యంలో స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్న వారి కోసం రాష్ట్రమంతటా కోవిడ్ దవాఖన ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగి ఈ మేర‌కు నారాయ‌ణ్‌పేట్ జిల్లా మాగ‌నూర్ లో తొలి ద‌వాఖ‌న గత నెల టీటా ప్రారంభించింది.

టీటా ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వంతంగా సేవ‌లు అందిస్తున్న ఈ ద‌వాఖ‌న‌కు కొన‌సాగింపుగా మ‌రో రెండు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. తాజాగా దీనికి నేడు మ‌రో కేంద్రం పెద్దదార్‌ప‌ల్లి అంగ‌న్‌వాడీ కేంద్రంలో కోవిడ్ ద‌వాఖ‌న‌ ప్రారంభ‌మైంది. ఈ కోవిడ్ ద‌వాఖ‌న ఏర్పాటు దాత,అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నివాసి గుముడాల శ్యామ్ ప్ర‌సాద్ గౌడ్ తండ్రి బాల‌రాజ్ గౌడ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించ‌గా స్థానిక డీఎస్పీ విశేష అతిథిగా విచ్చేశారు.

కోవిడ్ దవాఖన పనితీరు ఇలా…

సంప్ర‌దాయ వైద్య స‌హాయం ప‌నితీరు రూపంలోనే వసతులన్నీ ఉంటాయి. పీపీఈ కిట్లతో వాలంటీర్లు సిద్ధంగా ఉంటాయి. స్థానిక ల్యాబ్ లతో ఒప్పందం కుదుర్చుకొని ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. ఓపీ ద్వారా రోగి వీడియో కన్సల్టింగ్ రూపంలో వైద్యుల‌తో అనుసంధానం అవుతారు. పీహెచ్‌సీలో కోవిడ్ నిర్దారణ అయిన వారికి ఇక్కడ వైద్య సహాయం వీడియో కన్సల్టింగ్  రూపంలో సాగుతుంది. ఇక్క‌డ సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) , సీఎంఎపీ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.

టీటా అధ్య‌క్షుడు సందీప్ మ‌ఖ్తల సార‌థ్యంలోని బృందం హ‌న్వ‌డ మండ‌లంలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి వివిధ గ్రామాల‌ను అధ్య‌యనం చేసిన అనంత‌రం ఈ గ్రామాన్ని కోవిడ్ ద‌వాఖ‌న కోసం ఎంపిక చేశారు. ఈ కోవిడ్ ద‌వాఖ‌న‌ ఇద్ద‌రు వైద్యులు ఈ సెంట‌ర్‌కు వ‌చ్చే రోగుల‌కు స‌హాయంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండ‌నున్నారు.

మ‌రో ఇద్ద‌రు హెల్త్ వాలంటీర్లు ఈ కేంద్రంలో ఉండి సేవ‌లు అందించ‌నున్నారు. టీటా త‌న టి.క‌న్స‌ల్ట్ టెక్నాల‌జీని క్షేత్ర‌ స్థాయిలో నిర్వ‌హ‌ణ స‌హా ఇత‌ర స‌హాయ సంబంధ‌మైన అంశాల బాధ్య‌త తీసుకుంది. క్లిక్ ఇన్ సైట్ కంపెనీ టెక్నాల‌జీ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. కోవిడ్ థ‌ర్డ్‌వేవ్ పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టి ఈ కేంద్రంలో వైద్య స‌హాయం అందించ‌నున్నారు.

మెరుగైన వైద్య‌సేల కోసం టీటా ఆధ్వ‌ర్యంలో కోవిడ్ ద‌వాఖ‌న‌లు

ఈ సంద‌ర్భంగా టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల మాట్లాడుతూ, క‌రోనా స‌మ‌యంలో మారుమూల గ్రామాల ప్ర‌జ‌లకు మెరుగైన వైద్య‌సేల కోసం టీటా ఆధ్వ‌ర్యంలో కోవిడ్ ద‌వాఖ‌న‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఏటీఎస్ ద్వారా దాత‌లు ముందుకు రావ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌ని  పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం ఏర్పాటు చేయ‌బోతున్న కేంద్రాల‌లో కోవిడ్ థ‌ర్డ్‌వేవ్ ముప్పుపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లో మ‌రిన్ని కోవిడ్ ద‌వాఖ‌న‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్న సందీప్ మ‌ఖ్తాల ఇందుకోసం వివిధ ప్రాంతాల‌ను అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా డీఎస్పీ శ్రీ‌ధ‌ర్‌, ఎంపీడీఓ ధ‌నుంజ‌య్ గౌడ్‌, ఎంఆర్ఓ బి.శ్రీ‌నివాస్‌, స్థానిక జెడ్పీటీసీ విజ‌య్ నిర్మ‌ల‌ ర‌మ‌ణారెడ్డి, ఎంపీపీ బాల‌రాజ్‌, స‌ర్పంచ్ వెంక‌న్న , పంచాయ‌తీ సెక్ర‌ట‌రి ర‌మాదేవి,  మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ప్రీతి, స్థానిక నాయ‌కులు క‌రుణాక‌ర్ గౌడ్‌, జి.కృష్ణ‌య్య గౌడ్‌,  జె.గోపాల్‌, ఐ.కృష్ణ‌య్య గౌడ్‌, తేజ‌, సిద్ద‌ప్ప‌, స‌త్త‌య్య‌గౌడ్‌, వెంక‌య్య‌, వెంక‌న్న‌, క్లిక్‌ ఇన్ సైట్ స‌భ్యులు వినోద్ , రాజేశ్వ‌రి, టీటా స‌భ్యులు ఇలియాస్ , సౌమ్య‌, రోష్ని, ర‌మ్య , శ్రీ‌నివాస్ మ‌ర్రి , రాఘ‌వ్ గౌడ్‌, రాజ‌గోపాల్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

కేంద్రం దిగి వ‌చ్చే దాకా పోరాటం ఆపొద్దు

Sub Editor

చైనాలో మళ్ళీ కరోనా .. విమానాల రద్దు.. స్కూల్స్ బంద్..

Sub Editor

ప్రయోగాలు చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి

Satyam NEWS

Leave a Comment