బిచ్కుంద బస్ స్టాండ్ లో వివిధ ప్రాంతాలకు ప్రయాణమయ్యే ప్రజలకు కోవిడ్ 19 వ్యాధి గురించి అవగాహన సదస్సును నేడు నిర్వహించారు. ఆరోగ్య బోధకుడు దస్థిరాం, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఇంతియాజ్ అలీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు బాన్స్వాడ డివిజన్ పరిధిలో కరోనా(కోవిడ్-19) వైరస్ వ్యాధి గురించి జరిగిన ఈ అవగాహన సదస్సును నిర్వహించారు.
కరోనా వ్యాధి లక్షణాలు: తలనొప్పి , జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఛాతి నొప్పి, ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లక్షణాలు ఉంటాయి. ఈ లక్షలు ఉన్నవారు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు,గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రముగా కడుక్కోవాలి, ఇతరులకు అపరిచిత వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు,
తుంపరులు పడకుండా మాస్క్ ధరించాలి, చల్లని ఆహారం, ఫ్రిజ్ లోని ఆహారం, ఐస్ క్రీమ్ తినకూడదు, బహిరంగ ప్రదేశాల్లో, జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు, గొంతు నొప్పి ఉంటే గోరు వెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించాలి ఇలాంటి అంశాలను తెలుపుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో స్థానిక ANM లు ఫ్లోరెన్స్, అంగనవాడీ కార్యకర్తలు తో పాటు ఆశాలు పాల్గొన్నారు.