36.2 C
Hyderabad
May 12, 2024 16: 08 PM
Slider ఆదిలాబాద్

ఈ సారు ఇక్కడ అధికారి కాదు ఈ ప్రాంతానికి మహారాజు

MRO order

న్యాయస్థానం ఆదేశాలు ఎంఆర్ఓ పాటించాలా? ఎంఆర్ఓ ఆదేశాలు న్యాయస్థానం పాటించాలా? నాకు అవ్వన్నీ తెల్వదు సార్ నేను చెప్పిందే న్యాయం, నేను చేసిందే చట్టం అంటున్నాడు ఒక ఎంఆర్ఓ. భూమి సమస్యలు రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో అధికార యంత్రాంగం వాటిని తగ్గించేందుకు ప్రయత్నించాల్సింది పోయి పెంచుతున్నారు.

కోర్టులో న్యాయం జరిగినా ఎంఆర్ఓ మాత్రం న్యాయం చేయట్లేదని కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్కెపల్లి గ్రామానికి చెందిన చండి చరణ్ బిస్వాస్ అనే 67 ఏళ్ల వ్యక్తి వాపోతున్నాడు. చింతల మానేపల్లి మండలం లోని రవీంద్రనగర్ లోని సర్వే నంబర్ 65/21/1, 95/75/1 లకు అసలు ఓనరు చండి చరణ్ బిస్వాస్.

అయితే 2007 లో  సుచిత్ర దాస్ పేరిట ఆ సర్వే నెంబర్ లోని ఆ 5 ఎకరాలను  ఎమ్మార్వో  పట్టా మార్పిడి చేశారు. ఇదే తతంగం మళ్లీ 2011 లో కూడా చేసేశారు. చట్ట విరుద్దంగా సూచిత్ర దాస్ ను సుదన్న బైరాగి లను అన్నా చెల్లెళ్లుగా ధృవీకరించి సూచిత్ర దాస్ పేరిట ఎమ్మార్వో  పట్టా మార్పిడి చేశారు.

సర్వే నెంబర్ 95/75/1 లోని ఐదు ఎకరాలలో డా బి ఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం లో 3.25 ఎకరాలు ఈ అన్నా చెల్లెలు ఇచ్చేశారు. దానికి నష్టపరిహారం అందుకున్నారు. సుదన్న బైరాగి, సూచిత్ర దాస్ కలిసి 2011 లో అన్న చెల్లెలు గా చెప్తూ చట్ట వ్యతిరేకంగా 65/21/1 భూమిని మళ్లీ పట్టా మార్పిడి చేశారు.

వీటన్నింటిని చండి చరణ్ బిస్వాస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వాటిపై విచారణ జరిపిన సబ్ కలెక్టర్ ఆర్డర్ ఇస్తూ ఆర్ ఓ ఆర్ చట్టవిరుద్దం అని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత, అసలు యజమానులకు భూమి అప్పజెప్పాలని స్వయానా అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ అహ్మద్ నదీమ్ ఎమ్మార్వోకి ఆదేశించారు.

అయితే కొన్ని రోజులకే కలెక్టర్ బదిలీ అవ్వడం తో తూ తూ మంత్రంగా చర్యలు తీసుకుని ఉన్నతాధికారుల ఆర్డర్ ను ఎమ్మార్వో పట్టించుకోలేదు. ఎవరెన్ని చెప్పినా ఎమ్మార్వో మాత్రం అక్రమ పట్టాదారులకే వత్తాసు పలకడం ఆశ్చర్యం కలుగుతోంది.

ఉన్నతాధికారులు చెప్పినా ఆదేశాలు ఇచ్చినా ఎమ్మార్వో వినకపోవడంతో చండి హైకోర్టు ను ఆశ్రయించారు. తమ భూమి తమకు ఇప్పించాలని పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఎమ్మార్వో పట్టించుకోవడం లేదని ఆయన కోర్టుకు విన్నవించడంతో కోర్టు ఆ భూమిని చండికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఎమ్మార్వో తనకి కోర్టు అదేశాలైతే ఎం? కలెక్టర్ అదేశాలైతే ఎం? అన్నట్లుగా వ్యవహారాలు నడిపిస్తూ భూమిని తనకు ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వేస్తూ వచ్చారని బాధితుడు అన్నాడు.  కోర్టులో కేసు నడుస్తున్నది కనుక కొత్త పాసు బుక్కులు జారీ చేయకండి అని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా కూడా డబ్బు ఉన్నోడిదే రాజ్యం అయినట్టు ప్రతీ దరఖాస్తును పక్కన పడేసి ఎమ్మార్వో వ్యవహరించాడని బాధితుడు అన్నారు.

కోర్టు వ్యవహారం ఉన్న ప్రతీ పాస్ బుక్ ఆపేయాలని ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా సదరు మహిళ  సూచిత్ర దాస్ కి ఆ భూమి కొత్త పాస్ బుక్ చట్టవ్యతిరేకంగా అప్పజెప్పారని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు.

కోర్టు ఆదేశాలకు, అప్పటి సబ్ కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా మాకు రావాల్సిన భూమి మాకు అప్పజెప్పాలని పలుమార్లు ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నానని ఎప్పుడు వెళ్లినా కానీ ఏదో పొంతన లేని సమాధానం చెప్తూ కాలం గడుపుతున్నారని అన్నాడు. అసలు కోర్టు కేసు ఉన్నప్పుడు కొత్త పాస్ బుక్ లు ఎలా జారీ చేస్తున్నారని అడిగినా ఎమ్మార్వోకి వత్తాసు పలికినట్లు వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మార్వో తను ఎలాంటి సర్వేలు చేయకుండా,ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా, కనీసం బాధితుడి కూడా తెలియకుండా కోర్టు చెప్పిన ఆర్డర్ కి వ్యతిరేకంగా ఆర్డర్ జారీ చేశారని అన్నాడు. నాకు తిరిగి మళ్ళీ సర్వే, పహానిలు ఆధారంగా, కోర్టు, కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వాలని, న్యాయం చేయాలని కోరుకున్న కానీ నేటికీ కూడా ఎలాంటి స్పందన లేదని భోరున విలపిస్తూ చెప్పాడు. మళ్లీ కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని అన్నాడు.

Related posts

సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం

Satyam NEWS

ఉత్తమ గ్రామ పంచాయతీగా వాజిద్ నగర్

Satyam NEWS

జర్నలిస్టుపై కొల్లాపూర్ ఎమ్మెల్యే కక్ష సాధింపు

Satyam NEWS

Leave a Comment