28.7 C
Hyderabad
May 6, 2024 08: 44 AM
Slider తెలంగాణ

గ్రామీణ విలేకరులకు టిజెఎస్ఎస్ అవార్డులు

anamchinni 1

గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ వివిధ సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి పాత్ర పోషిస్తున్న గ్రామీణస్థాయి విలేకరుల సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని, అందుకోసం త్వరలోనే టిజెఎస్ఎస్ తన అవార్డుల ప్రక్రియ విధి, విధానాలతో పాటు అవార్డులకు అర్హులైన విలేకరులను ఎంపిక చేయడం కోసం ఓ కమిటీ ప్రకటిస్తామని టీజేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ దేవి గ్రాండ్ హోటల్లో జాతీయ అవార్డు గ్రహీత ఖాజా పాషాకు అభినందన సభ జరిగింది. ఢిల్లీలో లార్డ్ బుద్ధ జాతీయ అవార్డు అందుకున్న, షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్, టిజెఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి ఎం.డి ఖాజాపాషా (కేపి)ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంచిన్ని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో గ్రామీణ స్థాయి జర్నలిస్టులు ఇదే రంగంలో ఎన్నో గొప్ప గొప్ప కథనాలను అందిస్తున్నారని, ముఖ్యంగా మానవీయ కోణంలో వ్యధలను, పరిశోధన కథనాలను అందిస్తున్న విలేఖరులకు ఇకపై సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవార్డులను అందజేస్తామని ప్రకటించారు.

అభినందన సభకు విశిష్ట అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ దిలీప్ చంద్ర, ఎంఎన్ఆర్ సేవా సంస్థల అధినేత సోమిరెడ్డి నరేందర్ రెడ్డి, టీజేఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి మండ రాజేష్, రాగుల శ్రవణ్, అఫ్జల్, లీగల్ అడ్వైజర్ ఎ.అంజయ్య, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, గద్వాల జోగులాంబ జిల్లాల నుండి పలువురు జర్నలిస్టు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి, కోశాధికారులు గౌటి రామకృష్ణ, మండ రాజేష్ లు మాట్లాడుతూ కెపికి జాతీయ అవార్డు వచ్చిన స్పూర్తితోనే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరులకు గుర్తింపు ఇస్తామని అన్నారు. జర్నలిస్టుల భద్రతకై సంక్షేమ సంఘం  ఇన్సూరెన్స్, గుర్తింపు కార్డులను త్వరలోనే జారీ చేస్తామని ఆన్ లైన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు.

సామాజిక వేత్త సోమిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విలేకరి వృత్తి ఎంతో సాహసోపేతంతో కూడుకున్నదని అలాంటి వృత్తిలో ఖాజాపాషా విశేషంగా రాణిస్తూ జాతీయ స్థాయిలో అవార్డు కైవసం చేసుకోవడం విశేషమన్నారు. డాక్టర్ దిలీప్ చంద్ర మాట్లాడుతూ జర్నలిజంలో నిబద్ధతగా పనిచేస్తూ ఖాజాపాషా పేరు ప్రఖ్యాతులను గడించారని అన్నారు. టీజేఎస్ఎస్ జర్నలిస్టులకు వైద్య పరంగా ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

లీగల్ అడ్వైజర్ న్యాయవాది అంజయ్య మాట్లాడుతూ ఖాజాపాషా సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం షాద్ నగర్ కు వన్నె తెచ్చిందని కొనియాడారు. ఖాజాపాషా మాట్లాడుతూ తనకు లభించిన జాతీయ అవార్డుతో సమాజంలో మరింత బాధ్యత పెంచిందని, గురుతరమైన బాధ్యతతో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో షాద్ నగర్ అధ్యక్షుడు ఈరని జంగయ్య సీనియర్ జర్నలిస్టులు శివకుమార్, చందు, మస్లియోద్దీన్, వజ్రలింగం, శ్రీధర్ రాజు, రాములు గౌడ్, మెడిగ శ్రీను, ప్రవీణ్ యాదవ్, రమేష్ కన్నా, సందీప్, రవి, ఇక్బాల్, నరసింహా గౌడ్, అరగిద్ద చారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంచాయితీ ఎన్నికలు: మద్యం నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్ రూం

Satyam NEWS

రాష్ట్రంలో 5 పామాయిల్ పరిశ్రమల స్థాపనపై మంత్రి తుమ్మల తొలి సంతకం

Satyam NEWS

ములుగు లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment