కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంట గ్రామాల సరిహద్దుల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 9మంది మందు బాబులను సోమవారం నాడు పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు. పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. బద్దిపల్లి కి చెందిన కే సురేష్, ఏ రాజ్ కుమార్, చింతకుంట కు చెందిన కె రమేష్, ఎం మహేష్, రేకుర్తి కి చెందిన హెచ్ హరీష్, కొత్తపల్లికి చెందిన కె సిద్దార్థ, ఎలగందుల కు చెందిన గుండా కొమురయ్య, గుండా సంతోష్ కుమార్, గట్టుభుత్కూర్ నకు చెందిన గంగాధర మహేష్ లు పట్టుబడ్డారు. వీరిని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
previous post