27.2 C
Hyderabad
May 18, 2024 19: 03 PM
Slider ప్రత్యేకం

మంత్రి బొత్స సత్యనారాయణ పని అయిపోయింది

#babu

విజయనగరం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ సభలో చంద్రబాబు ఘాటు విమర్శ

విజయనగరం లో బొత్స, స్థానిక ఎమ్మెల్యే పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు బాబు జోస్యం చెప్పారు.”ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి” అన్న టీడీపీ నిరసన కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం లో కోట జంక్షన్ వద్ద రాత్రి 8.15 గంటల ప్రాంతంలో మాట్లాడారు. బొబ్బిలి నుంచీ విజయనగరం లోకి వచ్చిన బాబు… ద్వారపూడి కి వచ్చిన చంద్రబాబు కు దేశం నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచీ ఓపెన్ టాప్ లో ఆశోక్ గజపతిరాజు తో కోట జంక్షన్ వద్దకు వచ్చి వచ్చిన అశేష జనవాహిని ని ఉద్దేశించి మాట్లాడారు.

ఇక కార్పొరేషన్ లో…ఒక్కో డివిజన్ నుంచీ 300 మంది ని తీసుకురావాలని జిల్లా పార్టీ ఆదేశించిన మేరకు.. దాదాపు ఒక్క విజయనగరం లో  20 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…. జగన్ బటన్ నొక్కడం తప్ప…ఇంకేమీ చేతకాదని అందరూ దోపిడీకి పాల్పడుతున్నారని బాబు ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో కు విజయనగరం పర్యటనలో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు మాట్లాడుతూ నా పై యువత, ఆడబిడ్డల అభిమానం చూసాను. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ ప్రభుత్వ బాదుడే కనిపిస్తుంది

జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికి పోవడం ఖాయం. రాష్ట్రాన్ని నాశనం చేసిన సీఎంకు పాలించే అర్హత లేదు రాష్ట్రంలో జగన్ ఒక బందిపోటు అయితే.. గజపతినగరంలో ఎమ్మెల్యే ఓ దోపిడీ దారు అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. కొందరు అధికారులు తప్ప పోలీసులంతా మన పక్షమే. పాపం వాళ్లకు రావాల్సిన నిధులు, బకాయిలు రావడం లేదు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కళంకిత పోలీసులను వదిలేది లేదు.

ఉత్తరాంధ్రపై జగన్ కు ప్రేమ లేదు…ఇక్కడ ఆస్తులపైనే ప్రేమ. ఉత్తరాంద్రలో రూ.40 వేల కోట్లు కొట్టేశారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తులసీవనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు విజయనగరం లో ఈ బొత్స, అయన తమ్ముడు అంటూ చంద్రబాబు విమర్శించారు. జగన్ బటన్ నొక్కుడు పేరుతో మరోవైపు బొక్కతున్నాడు. పేదల జీవితాలు ఎందుకు దుర్భరం అయ్యాయి..? జగన్ పాలన వల్లనే కదా? గజపతినగరం టీడీపీకి కంచుకోట…మళ్ళీ టీడీపీ గెలవాలి. షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తా..రైతులను ఆదుకుంటా సైకో పాలన పోవాలి…..సైకిల్ పాలన రావాలి. భయం ఉంటే బానిసత్వం చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

గ్లామరస్ ‘పాపతో పైలం’… ‘హంట్’లో ప్రత్యేక గీతం విడుదల

Satyam NEWS

ప్రపంచానికి శుభవార్త: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

Satyam NEWS

చిలకలూరిపేట లోని ఓగేరువాగులో గల్లంతయిన యువకుడు

Satyam NEWS

Leave a Comment