38.2 C
Hyderabad
May 5, 2024 22: 10 PM
Slider నిజామాబాద్

పల్లెల సమగ్ర అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

#Minister Vemula Prashant Reddy

పల్లెల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లో మంత్రి విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

భీంగల్ మున్సిపల్ పట్టణంలో రూ. 28.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పీప్రి గ్రామంలో రూ. 5.10 కోట్లతో భీంగల్ నుండి పిప్రి మీదుగా ముచ్కూర్ వరకు డబుల్ లైన్ రోడ్ పునరుద్ధరణ పనులకు, రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ పనులకు శంకుస్థాపనలు చేశారు.

కొత్త తండా నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రహత్ నగర్ గ్రామంలో పల్లికొండ నుండి రహత్ నగర్ మీదుగా దేవక్కపెట్ వరకు రూ. 10 కోట్లతో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి,రూ. 20 లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు, తాళ్లపల్లిలో మంజూరైన రూ. 20 లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేశారు.అదేవిధంగా రూ.9.30 కోట్ల అంచనా వ్యయంతో దేవక్కపెట్ – తాటిపల్లి బి.టి రోడ్ నిర్మాణ పనులకు, కారేపల్లిలో రూ. 20 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో 50 లక్షల నిధులతో నిర్మించిన ప్రజా కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.

ఏర్గట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల – ఉప్లూర్ రోడ్ ఊర చెరువు అలుగు పై రూ. 1.40 కోట్లతో నిర్మించే వంతెన పనులకు, తడ్పాకల్ లో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ పనులకు , మోర్తాడ్ మండలము పాలెం గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ పనులకు శంకుస్థాపనలు జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, రూ. వందల కోట్ల నిధులను మంజూరు చేస్తూ పల్లె ప్రాంతాల రోడ్లను అద్దాల్లా మెరిపిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే బాల్కొండ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణాలకు 40 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని అన్నారు. ముఖ్యంగా దేవక్కపేట్ – తాటిపల్లి రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల 70 ఏళ్ల కల నెరవేరుతోందని మంత్రి హర్షం వెలిబుచ్చారు.

అటవీ శాఖ అనుమతులు లేనందున రోడ్డు నిర్మాణం ఇంతకాలం పాటు వీలుకాలేదని అన్నారు. రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అటవీ శాఖామంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఫారెస్ట్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించారని, రోడ్డు నిర్మాణానికి రూ. తొమ్మిది కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, సహచర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి వేముల నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు ప్రకటించారు.

తాటిపల్లి – మర్రిమడ్ల రోడ్డు కు సైతం రూ.20 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఈ కొత్త రోడ్ల నిర్మాణాలతో గిరిజన జనాభా అధికంగా గల గ్రామీణ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడి, ఆయా ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లెల అభివృద్ధికి పాటుపడుతున్న తమ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాల్లో డీపీఓ జయసుధ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావ్, ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్, ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, జెడ్పి కో ఆప్షన్ సభ్యుడు మొయిజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

నో వ్యాక్సినేషన్ థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో నో ఎంట్రీ

Sub Editor

రహదారుల భద్రత కు పటిష్టమైన చర్యలు చేపట్టాలి

Bhavani

టీడీపీ ఇన్‌చార్జీ చ‌ద‌ల‌వాడ అరెస్ట్

Sub Editor

Leave a Comment