లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఈ కేంద్రం కరోనా సమయంలో విశిష్ట సేవలను అందించింది.
విశిష్ట సేవలను అందించిన మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ ను ఎంపీపీ, జడ్పీటీసీలు గూడెపు శ్రీనివాస్, కొప్పుల సైదిరెడ్డి సోమవారంనాడు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ సమయంలో ప్రభుత్వ వైద్యం అంటే భయపడిన ప్రజలు కరోనా సమయములో ప్రభుత్వం వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
వైద్యులు, సిబ్బంది కల్పిస్తున్న ధైర్యంతో సాధారణ ప్రజలే కాక గర్భిణీ స్త్రీలు సైతం పీహెచ్ సి లింగగిరి వైపు మొగ్గు చూపడం విశేషం అన్నారు.
తహసీల్దార్ వజ్రాల జయశ్రీ మాట్లాడుతూ ప్రైవేట్ వైద్యశాలలకు ధీటుగా వైద్యంతో పాటు పారిశుద్యం, వసతుల కల్పనల వల్ల ప్రజలు ప్రభుత్వ దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని, ఇది శుభ పరిణామం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి హెచ్ న్ ప్రమీల, G.విజయ తదితరులు పాల్గొన్నారు.