29.7 C
Hyderabad
April 29, 2024 08: 30 AM
Slider ముఖ్యంశాలు

రూ.కోటి సాయం చేసిన తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య

KTR Industries

ప్రపంచ వ్యాప్తంగా మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారి  పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న  పోరాటానికి తెలంగాణ  పారిశ్రామిక వేత్తల సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. 

కరోనా మహమ్మారి నుండి  రాష్ట్ర ప్రజల ను  కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్స్,  మునిసిపల్ సిబ్బంది, పోలీసులు,  మిగతా  ప్రభుత్వ శాఖలకు చేయూతనివ్వడం MSME పరిశ్రమలు తమ సామాజిక  బాధ్యతగా భావిస్తున్నాయి.

ఈ లాక్ డౌన్ వల్ల MSME పరిశ్రమలకు రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నప్పటికీ,  పారిశ్రామిక వేత్తలు TIF ఇచ్చిన పిలుపు మేరకు  ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1, 22, 42, 419/-లను విరాళంగా ఇచ్చారు.

సంబంధిత చెక్కును ఈరోజు పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ కు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు కే. సుధీర్ రెడ్డి,  కార్యదర్శి సరే ఎస్. వి. రఘు,  సంయుక్త కార్యదర్శి మిరుపాల గోపాల్ రావు,  TSIIC MD E.V.నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే బీరం ఇలాకాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగలు

Satyam NEWS

వ్యవసాయ బిల్లు భూమికి చెర, రైతుకు ఉరి

Satyam NEWS

అపరిశుభ్ర పరిసరాలే అంటువ్యాధులకు మూలం

Bhavani

Leave a Comment