30.2 C
Hyderabad
May 17, 2024 18: 19 PM
Slider హైదరాబాద్

సంక్షేమ పథకాలు అమలుకై పోరాటాలు తీవ్రతరం చేయాలి

#cpi

జనాకర్షక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కొందరికి లబ్దిచేకూరే విదంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, పేదల అభివృద్ధికి మొత్తం సంక్షేమ పథకాలు అమలుకై పోరాటాలు తీవ్రతరం చేయాలనీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

దేశంలో 70 శతం మంది ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, చాలామంది కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు భూములు లేవని, ఇందులో దళిత, గిరిజనులే ఎక్కువగా ఉన్నారని, వారు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుర్తిగా విఫలమైయ్యాని అయన ఆరోపించారు. అందరి బ్రతుకులు మారుతున్నాయని కానీ పేద వ్యవసాయ కార్మికుల బతుకులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం “వ్యవసాయ కార్మికుల సమస్యలపై” రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను హైదరాబాద్, బోడుప్పల్, ఎస్ఎస్ఎస్ గార్డెన్స్, కామ్రేడ్ గుండా మల్లేష్ హాల్ లో బుదవారం నిర్వహించింది.  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల మల్లేష్ స్వాగతం పలుకగా, రాష్ట్ర  అధ్యక్షులు కలకొండ కాంతయ్య ఈ వర్క్ షాప్ కు అధ్యక్షత వహించారు.

ఈ వర్క్ షాప్ ను పల్లా వెంకట్ రెడ్డి ప్రారంభించి ప్రసంగిస్తూ వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి కల్పించడం కోసం గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకరావాలని వామపక్ష పార్టీలు అప్పటి యుపిఏ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాయని, వామపక్షాల అభ్యర్థనను గౌరవించి అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పందించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చేట్టాన్ని తీసుకవచ్చి అమలు చేసిందని, ఈ పథకంతో పేదలు కొంతమేరకు లబ్దిపొందుతున్నారని అయన తెలియజేసారు.

తగిన బడ్జెట్ కేటాయించకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుందని. దింతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే లబ్ది చేకూరుస్తుంది తప్ప పేదలకు ఏమి చేయదని తేటతెల్లమైంది అయన విమర్శించారు.

ఎన్నడూలేనివిదంగా గత ఎనమిది ఏళ్ళ మోడీ పాలనలో  పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలు పైకే ప్రయాణం చేస్తున్నాయని, వాటి ధరలను నియంత్రించకుండా జాతీయ ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థల్ని, బ్యాంకులను అందినకాడికి  అమ్ముకుంటూ బడా వ్యాపారులకు లబ్ధిచేయడానికి పాకులాడుతున్నాడని, సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోవడంలేదని అయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులకు మూడు ఎకరాల భూమిని, అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు లేదా ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాడని, పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నాడని అయన విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతరేక విధానాలకు నిరసిస్తూ, తమ ఉపాధిని రక్షించుకోవడం కోసం పేదలు ఐక్యమై ఉద్యమాలు నిర్మించాలని పల్లా వెంకట్ రెడ్డి కోరారు. భారతీయ కేతా మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు టి. వెంకట్ రాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటేటా బడ్జెట్‌ తగ్గిస్తూ ఉపాధి సమస్యలు పట్టించుకోకుండా పేదలకు ఉపాధి లేకుండా చేయడం కోసం  కఠిన నిబం ధనలను తెచ్చి పేదలకు ఉపాధి లేకుండా చేస్తుందని విమ ర్శించారు.

బాలమల్లేష్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధికి బడ్జెట్‌ పెంచాల్సింది పోయి తగ్గించడం పేదలకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు. ఉపాధి హామీలో సామాజిక వర్గీకరణ విరమించుకొని వంద రోజుల పనిదినాలను 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.600 ఇచ్చేలా వేతనం షెడ్యూల్‌ చట్టాలను సవరించాలని అలాగే కూలీలకు పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

కలకొండ కాంతయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు రైతుబంధు పథకం మాదిరిగా కూలి బంధు ఇవ్వాలని, అలాగే 55 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇవ్వాలని కోరారు. వర్క్ షాప్ ప్రారంభానికి ముందు స్థానిక అంబెడ్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీ నిర్వహించినంతరం, సిపిఐ సీనియర్ నాయకులూ రచ్చ వాసుదేవ్ ఎర్ర జండా ఆవిష్కరించారు.

ఈ వర్క్ షాప్ లో బికెఏంయు జాతీయ సమితి సభ్యులు మోతె జాంగా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వర్ రావు, అక్కపల్లి బాబు, ఏం. తాజుద్దీన్, కార్యదర్శులు బుద్దుల జంగయ్య, సృజన కుమార్, చింతకుంట్ల వెంకన్న, యేసయ్య, దుబ్బాసు రాములు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎస్. బాలరాజ్, ప్రధాన కార్యదర్శి టి. శంకర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రొయ్యల కృష్ణ మూర్తి, నేతలు  లక్ష్మి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పల్లివాడ ప్రజలతో రక్ష కట్టించుకున్న టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Satyam NEWS

కామారెడ్డిలో అభివృద్ధి పనులకీ 40 కోట్లు మంజూరు

Satyam NEWS

ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేల్లో కొత్త కలవరం

Sub Editor

Leave a Comment