32.7 C
Hyderabad
April 26, 2024 23: 10 PM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో అభివృద్ధి పనులకీ 40 కోట్లు మంజూరు

#gampagovardhan

కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి 40 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో ఆర్ అండ్ బి, కెజిబివి పాఠశాలలు, హెల్త్ సబ్ సెంటర్లకు నిధులు మంజూరయ్యాయన్నారు. మాచారెడ్డి మండలంలోని ఘన్ పూర్(ఎం) నుంచి చుక్కాపూర్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, డివైడర్, సెంట్రల్ లైటింగ్ కోసం 14 కోట్లు మంజూరయ్యాయన్నారు.

బిబిపేట కెజిబివి పాఠశాల అప్ గ్రేడ్ కోసం 2.30 కోట్లు, బిక్కనూరు కెజిబివి పెండింగ్ పనుల కొసం 21 లక్షలు, రాజంపేట కెజిబివి పెండింగ్ పనులకు 39 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే ఆర్ అండ్ బి ద్వారా మాచారెడ్డి మండలం గంగారాం తండా రోడ్డుకు 1.25 కోట్లు, ఎదుల్ల గుట్ట తండాకు 65 లక్షలు, మొగిలి గుట్ట తండాకు 85 లక్షలు, మఠంలాల తండాకు 1.75 కోట్లు, బ్రహ్మల పల్లి తండాకు 1.80 కోట్లు, దంతపూర్ తండాకు 65 లక్షలు, సోమార్ పేట తండాకు 90 లక్షలు, బోడ గుట్ట తండాకు 90 లక్షలు, రామారెడ్డి మండలం గొడుగుమర్రి తండాకు 1.02 కోట్లు, మొండి వీరన్న తండాకు 65 లక్షలు, సున్నపు రాళ్ళ తండాకు 1.50 కోట్లు, రమణ తండాకు 90 లక్షలు, వసురాం తండా నుంచి సేవ్లా నాయక్ తండా వరకు 95 లక్షలు మంజూరైనట్టు తెలిపారు.

గుండారం మొండివాగు బ్రిడ్జికి 3.25 కోట్లు, అడ్లూర్ రంగంపేట బ్రిడ్జికి 3.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే హెల్త్ డిపార్ట్ మెంట్ ద్వారా 8 సబ్ సెంటర్లకు 1.60 కోట్లు మంజూరు అయ్యాయని, అంబారిపేట, దోమకొండ, ముత్యంపేట, తిమ్మక్ పల్లి, భవాని పేట, ఎల్లంపేట, ఇసాయిపేట, సింగరాయిపల్లి గ్రామాలకు ఒక్కొక్క సబ్ సెంటర్ కు 20 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

Related posts

కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

Satyam NEWS

కుక్కల దాడిలో అరుదైన చుక్కల జింక మృతి

Satyam NEWS

ఎంఎల్ఏ మేడా వర్గీయులు వైసిపి నుంచి టిడిపి లోకి జంప్

Satyam NEWS

Leave a Comment