24.7 C
Hyderabad
May 19, 2024 02: 13 AM
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంపై విచారణ జరపాలి

#raghurama

అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీ లో  మొదలుపెట్టిన సర్పయాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం స్ఫూర్తితో, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మద్యం కుంభకోణం పై విచారణ జరిపించాలన్నారు. అసలు రాష్ట్రంలో అసలు మద్యం కుంభకోణం అన్నదే చోటు చేసుకోలేదని తేలితే తమ పార్టీకే మంచిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు,  నగదు లావాదేవీల పై సమగ్ర విచారణ జరిపించాలని రఘురామకృష్ణం రాజు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు.

ఆదిశగా నూతన గవర్నర్  కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని,  లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సచ్చీలతను నిరూపించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిబిఐ విచారణను కోరాలని సూచించారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఢిల్లీలో జరిగిన చిన్నపాటి మద్యం కుంభకోణానికి ఉపముఖ్యమంత్రి సిసోడియాను  అరెస్టు చేశారని, ఇప్పటికే ఈ కుంభకోణంలో  ఏడు,  ఎనిమిది మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.

ఇంకా కూడా అరెస్టు జరగవచ్చునని అంటున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో ఫార్మా, కీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని  తొలుత అరెస్టు చేసిన విషయాన్ని రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  చెడు సావాసాల వల్ల శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టారని, ఆడాన్ డిస్టలరీస్ అనే సంస్థను స్థాపించారన్నారు. రాష్ట్రంలోని డిస్టలరీస్ ను లీజు కు తీసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని తెలిపారు.

దేశంలో ఎక్కడా లభించని మద్యం బ్రాండ్లను సృష్టించి వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగినట్లుగా ప్రజలు అనుమానిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు  తెలిపారు. ఢిల్లీ మద్యం  కుంభకోణంపై నూతన లెఫ్టినెంట్ గవర్నర్  కేంద్రానికి లేఖ రాసి, సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరడం జరిగిందని వెల్లడించారు.

సిబిఐ తన విచారణలో భాగంగా సౌత్ గ్రూప్ కింగ్ పిన్ గా ఉన్న శరత్ చంద్రారెడ్డిని  అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ తరహా అవినీతిని సహించారన్న రఘురామకృష్ణం రాజు, రాష్ట్రంలో 100 కోట్ల కుంభకోణం చేశారంటే వారు మహాత్ము లేనన్నారు. 50 వేల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే మాత్రమే నిందితులంటూ  వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో మద్యం కుంభకోణం విలువ ఎంత అన్నది ఎవరు అంచనా వేయలేకపోతున్నారన్నారు. ప్రతి ఏటా 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన మద్యం వ్యాపారంలో, సింహ భాగం ఆడాన్ డిస్టలరీస్ దేనన్న సత్యం,  జగన్, జగమెరిగిన దేనని  పేర్కొన్నారు.  రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ బాధ్యతలను కేంద్ర సర్వీసులో ఉన్న స్వజాతీయులైన   కిందిస్థాయి అధికారులకు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించాల్సిన పోస్టులో, కేంద్ర సర్వీసులకు చెందిన జూనియర్ అధికారుల నియమించి, వారికి పూర్తి బాధ్యతలను అప్పగించడం వెనుకనున్న మతలమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎండి గా నియమించిన వారికి పూర్తి బాధ్యతలను అప్పగించి, రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ పేరిట అప్పులు చేశారన్నారు.

అసలు ఏ ప్రాతిపదికన  ఆడాన్ డిస్టలరీస్ నుంచి మద్యం సరుకును కొనుగోలు చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో మూడు వేల పైగా మద్యం దుకాణాలు ఉంటే గత నాలుగేళ్లుగా  నగదు లావాదేవీలనే నిర్వహిస్తూ, ఇప్పుడు తూతూ మంత్రంగా 11 మద్యం అవుట్లెట్లలో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికీ డిజిటల్ లావాదేవీలు నిర్వహించ పోవడం వల్ల, మద్యం  అమ్మకాలలో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.

రాష్ట్రంలో రామరాజ్యాన్ని అందిస్తున్న తన ప్రభుత్వంపై  కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ముందుకు వచ్చి సిబిఐ విచారణను కోరితే మంచిదని సూచించారు. ప్రపంచ దేశాలలోని ప్రఖ్యాత బ్రాండ్లకంటే, రాష్ట్రంలో విక్రయిస్తున్న బ్రాండ్లు గొప్పవని భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఆ బ్రాండ్ల తయారీకి వినియోగిస్తున్న రా మెటీరియల్ గురించి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అలాగే దేశవ్యాప్తంగా లభిస్తున్న ప్రముఖ మద్యం బ్రాండ్లు, రాష్ట్రంలో ఎందుకు లభించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు . దేశవ్యాప్తంగా టెండర్లలో పాల్గొన్న ప్రముఖ మద్యం తయారీ కంపెనీలు, తమ బ్రాండ్లను అన్ని రాష్ట్రాలలో విక్రయిస్తున్నాయన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఒకటి రెండు శాతం కంటే ఎక్కువగా ప్రముఖ మద్యం బ్రాండ్లు లభించడం లేదని, అసలు వారు టెండర్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని నిలదీశారు.

Related posts

మనసు భాష

Satyam NEWS

పోలీసు ఉద్యోగాలశిక్షణకు ఏప్రియల్ 17న స్క్రీనింగ్ టెస్ట్

Sub Editor 2

ఏ.స్ రావు నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్  షోరూంలో “బ్రైడల్ జ్యువెలరీ షో

Satyam NEWS

Leave a Comment