29.7 C
Hyderabad
May 6, 2024 03: 53 AM
Slider ముఖ్యంశాలు

ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు

#sandsmuggling

అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ హెచ్చరించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన ఇసుకరీచుల నుండి ఇసుకను రవాణా చేయాలని ఆదేశించారు.

ఇసుక ట్రాక్టర్లు పరిమిత బిల్లులను పొంది ఇసుకను తరలించాలని సూచించారు. పెబ్బేరు మండలం రామమ్మ పేట, కిల్లా గణపురం మండలంలోని కమ్మలుద్దీన్ పూర్, అంతాయపల్లి గ్రామాలలో ఇసుక రీచ్ లు ఉన్నాయని తెలిపారు. మన ఊరు మనబడి కి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుకను వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని ట్రాక్టర్లకు ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని, చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పనులకు 24 గంటల లోపు ఇసుక రవాణా చేస్తామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం  ఇల్లీగల్ ఇసుక రవాణాను అరికడతారని తెలిపారు. ప్రతి ఇసుక రీచ్ లో సీసీటీవీలో ఏర్పాటు చేయాలన్నారు. ఫిల్టర్ ఇసుక పై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను బైండ్ ఓవర్ చేయాలని ఈ సమావేశంలో జిల్లా యస్పి చెప్పారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆర్డిఓ పద్మావతి డిఎస్పి ఆనంద రెడ్డి, మైనింగ్ శాఖ ఏడి విజయ్ రామ రాజు ఏవో రాజేందర్ గౌడ్, పి ఆర్ ఈ ఈ మల్లయ్య, తహసీల్దార్  లు  ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

టెన్షన్ టెన్షన్: ఆ రెండు పదవుల కోసం భారీ క్యూ

Satyam NEWS

Analysis: ఇప్పుడు వస్తున్న బర్డ్ ఫ్లూ ప్రమాదమా?

Satyam NEWS

బిజెపి కి తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మికులు ముందుకు రావాలి

Satyam NEWS

Leave a Comment