26.7 C
Hyderabad
May 3, 2024 09: 57 AM
Slider సినిమా

ఏ.స్ రావు నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్  షోరూంలో “బ్రైడల్ జ్యువెలరీ షో

#malabargold

ప్రపంచ దేశాల లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న  అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన ఎ.స్ రావు నగర్ షోరూంలోని మలబార్ గోల్డ్  డైమండ్స్ బ్రైడల్  జ్యువెలరీ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మోడల్ డెబోరా డోరిస్ హాజరై ప్రారంభించారు.

ఈ  సందర్భంగా మోడల్ డెబోరా డోరిస్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఏ స్ రావు నగర్ లో సెప్టెంబర్ 16 నుండి 19 వరకు  ఈ ప్రదర్శన కొనసాగుతుందని అన్నారు.ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడతాయని తెలిపారు.

అనంతరం మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఏ స్ రావు నగర్ స్టోర్ హెడ్ హిషబ్. పి. కే మాట్లాడుతూ భారత దేశంలో వివాహం అనేది రోజుల తరబడి చేసుకొనే అతి పెద్ద వేడుక అని,ఎన్నో కుటుంబాలు ఎందరో బంధువులు విచ్చేయడం, తమ ఆచార వ్యవహారాలతో ఒకరినొకరు గౌరవించుకుంటారని పేర్కొన్నారు. ఈ అసాధారణ పరిస్థితిని సైతం సానుకూల మార్గంలో ముందుకు తీసుకెళ్తూ, నేటి వధువు కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పిందని గుర్తుచేశారు.

తన వివాహం తనకెప్పటికీ సుమధురమని భావించేలా మైబిగ్ సందేశంతో ముందుకు వచ్చిందని, కొత్త పెళ్లికూతురి అందచందాల నుండి పొందిన ప్రేరణతో విస్మయపరిచే ఆభరణాల సేకరణలను ఈ ప్రచారంలో భాగంగా ప్రదర్శిస్తోంద తెలిపారు. అంతే కాకుండా, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు మరియు హస్తకళారూపాల ఆభరణాల బ్రాండ్ ‘డివైన్’, వజ్రాభరణాల కూడా ఈ ప్రచారంలో చోటుచేసుకున్నాయి.

బ్రాండ్ ‘మైన్’, అన్ కట్ వజ్రాభరణాల బ్రాండ్ ‘ఎరా’ మొదలైనవి మలబార్ గోల్డ్ & డైమండ్స్ వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ అనే ప్రచారం ప్రారంభించిందని, ఇందులో భాగంగా భారత దేశ వ్యాప్తంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూములలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకి అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్స్ గౌతమ్, భాస్కర్, షాన్, మార్కెటింగ్ ఇంచార్జీ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం జగన్ “ప్రజారంజక పాలన” ప్రజల్లో తీసుకెళ్లండి

Bhavani

బాబాయి హత్య తర్వాత తలకు కుట్లు వేసిన వ్యక్తి విచారణ

Satyam NEWS

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్

Satyam NEWS

Leave a Comment