25.7 C
Hyderabad
May 9, 2024 09: 37 AM
Slider మహబూబ్ నగర్

రాష్ట్ర స్థాయికి చేరిన వనపర్తి జిల్లా  పోలీస్ ప్రవర్తన

#Police

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామానికి చెందిన శివకుమార్ యాదవ్ ను వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు పెట్టిన పోలీస్ గురించి రాష్ట్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలిస్ ప్రవర్తన గురించి బిఆర్ఎస్ నేత,పెద్దమందడి మండల పరిషత్ అధ్యక్షుడు మేఘారెడ్డి స్పందించారు. బిసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కొత్తకోట సిఐ పై కేసు నమోదు చేయాలని పిర్యాదు చేశారు.

ఆ తర్వాత బిజెపి నేతలు పోలీసు దెబ్బలు తిన్న శివకుమార్ యాదవ్ ను పరామర్శించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలిపారు. శివకుమార్ కు బండి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు కూడా పరామర్శించారు. పోలీస్ చర్యలను ఖండించారు.వనపర్తి నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో ఉంది.వనపర్తి నియోజకవర్గ పోలీస్ సమస్య  ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

వనపర్తి నియోజకవర్గం ప్రజలు చైతన్య వంతులు. అధికారులు ఇష్టం వచ్చినట్లు పని చేస్తే ఇబ్బందులకు గురి కావడం ఖాయం. పోలీస్,జడ్జీలు,కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్షాలు, దినపత్రికలు,టివి,చట్టాలు తయారు చేసే వారితో వనపర్తి ప్రజలకు సంబంధాలు ఉన్నాయి.కేసుల్లో,సమస్యలలో ప్రజలను ఇరికిస్తే భయపడే సంప్రదాయం వనపర్తి బాధితులకు లేదు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన ముత్యంపేట మాజీ ఉప సర్పంచ్

Satyam NEWS

ఇస్రో ఆధ్వర్యంలో యువ విగ్యాన్ కార్యక్రమం

Satyam NEWS

సేంద్రియ వ్యవసాయ విధానంతోనే రైతుకు వెసులుబాటు

Satyam NEWS

Leave a Comment