30.7 C
Hyderabad
May 13, 2024 01: 39 AM
Slider మహబూబ్ నగర్

కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

#Niranjan Reddy

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి కంటికి వెలుగులను అందించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ఈనెల 18న ప్రారంభిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో కంటి వెలుగు కార్యాచరణ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం తో కలిసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 న చేపట్టిందని, కంటి చూపు తక్కువ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈనెల 18 నుండి వంద రోజుల పాటు జరిగే కంటి వెలుగు శిబిరాలలో గ్రామాలలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని కోరారు.

సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే విధంగా కంటి చూపు లేకుంటే లోకాన్ని చూడలేమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా లో 255 గ్రామ పంచాయతీలు, 87 మున్సిపాల్టి వార్డులు ఏక కాలం లో ప్రారంబిస్తారని, గ్రామ జనాబా ను బట్టి గ్రామ, మండల స్తాయి లో ఒక ప్రణాళిక ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 4:00 వరకు క్యాంపులలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశలు ఉంటారని, ప్రజాప్రతినిధులు క్యాంపు లకు చేరువలో ఉండి 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరిని క్యాంపులకు తరలించి కంటి పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని క్యాంపులకు తరలించాలని అన్నారు. పంచాయతి సెక్రటరీ లు, సర్పంచులు,ప్రజాప్రతినిదులు స్తనికంగాజరిగే ఏర్పాట్లు కుర్చీలు, షామియానా, వీలైతే ప్రజాప్రతినిధులు ప్రతి క్యాంపులో క్యాంపుకు వచ్చిన వారికి బోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. అన్ని దానాలలో అవయవ దానం గొప్పదని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కళ్ళు దానం చేస్తే వారిని నమోదు చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల నిపుణులైన డాక్టర్లు మన రాష్ట్రంలోనే వస్తారని అన్నారు. ప్రతిష్టాత్మకమైన 100 రోజుల కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజప్రతినిదులు విజయవంతం చేయాలనీ కోరారు.

జడ్పీచైర్మన్ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ ప్రపంచం లో ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చేపట్టలేదని, తెలంగాణా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, గిన్నిస్ రికార్డులో వచ్చే విదంగా చేయాలనీ,ఈ కార్యక్రమం పై ప్రజలకు నమ్మకం కలిగించాలని, తన పుట్టినరోజు సందర్భంగా తన కళ్ళు దానం చేస్తానని జడ్పీ చైర్మన్ తెలిపారు. ఈనెల 18 నుండి రెండో విడత కార్యక్రమాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంద జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా దేశం లోనే గొప్ప పేరు వస్తుందని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకువస్తుందని అన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం కంటి వెలుగు వంద రోజులు పాటు జరుగుతుందని ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామాలలో పర్యటించి కంటి రోగులను క్యాంపులకు తరలించి ఉచితంగా కంటి అద్దాలు ఇప్పించాలని అన్నారు. వీలైతే తాను కూడా క్యాంపులలో పర్యటిస్తానని ఎంపీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 18 నుండి వందరోజుల పాటు ఉచిత కంటి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 25 టీంలు ఏర్పాటు చేసినట్లు ప్రతి టీం అన్ని శిబిరాలను పర్యవేక్షిస్తుందని అన్నారు. కంటి వైద్య శిబిరాలకు తాగునీరు టాయిలెట్లు షామియానా, కుర్చీలు, అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎంపీడీవోలకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు తెలిపారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం మహోన్నతమైనదని అన్ని అవయవాలు కన్నా కంటి చూపు ఉండటం అదృష్టం అని అన్నారు. డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి 18 సంవత్సరాలు పైబడిన కంటి రోగులను క్యాంపులకు తరలించాలని అన్నారు. ఈ సందర్భంగా కంటి అద్దాలు పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, జెడ్పి సీఈవో విజయ నాయక్, డిఎంహెచ్వో శశికళ , రాష్ట్ర గిడ్డ oగుల చైర్మన్ సాయి చంద్ ,జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, సింగల్ విండో చైర్మన్లు, గ్రంథాలయ చైర్మెన్, జిల్లా అధికారులు, వైద్య సిబంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభం

Satyam NEWS

మంత్రి కేటీఆర్ రాక కోసం పటిష్ట పోలీసు బందోబస్తు

Satyam NEWS

కొల్లాపూర్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

Leave a Comment