28.7 C
Hyderabad
May 15, 2024 00: 48 AM
Slider ప్రకాశం

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గ్రామ వాలంటీర్

#Prakasham Dist

ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన గ్రామ వాలంటీర్ స్వయంగా కబ్జాలకు పాల్పడుతుంటే ఏం చేయాలి? ఏం చేయాలో అర్ధం కాక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు గ్రామస్థులు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వాలంటీర్ భూ కబ్జాకు పాల్పడ్డాడని ఆర్ అండ్ బి  DE కి, రామన్నపేట గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

వేటపాలెం పందిళ్లపల్లి రహదారిలో కొత్త కాలువ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన రోడ్డు  మార్జిన్, ఎత్తిపోతల పథకం ప్రాంగణంలోని డ్రైనేజీ భూమిని కలిపి సచివాలయ గ్రామ వాలంటీర్ సయ్యద్ బాబర్ అన్యాక్రాంతం చేశాడని వారు ఆరోపించారు.

అక్రమంగా షాపులు నిర్మించి అతను చట్ట విరుద్ధంగా ఆదాయం పొందుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వ భూమిలో కట్టడాలు నిర్మించి  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాలంటీర్ సయ్యద్ బాబర్ ని పై చర్య తీసుకొని వెంటనే అక్రమ కట్టడాలను తొలగించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

సదరు అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచుగా జరిగి పాదచారులు తరచుగా ప్రమాదాలకు గురి అవుతున్నారని వారు తెలిపారు.

అంతేకాకుండా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన నిర్మించిన ఈ అక్రమ నిర్మాణాల లో మద్యం సేవించడం పేకాట అలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారణంగా మనోభావాలను దెబ్బతింటున్నాయని వారున్నారు.

శుక్రవారం ఉదయం చీరాలలోని రోడ్లు & భవనాలు శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రామన్నపేట పంచాయతీ కార్యదర్శి కలిసి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేసిన వారిలో గ్రామస్తులు మీసాల వెంకయ్య, వెంకట నారాయణ రెడ్డి,వీరస్వామి రెడ్డి, చల్లా సుబ్బారావు ఇతరులు ఉన్నారు.

Related posts

ప్రపంచానికి శుభవార్త: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

Satyam NEWS

మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు, డెయిరీలు తెరుస్తాం

Satyam NEWS

బెస్ట్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకున్న ఫోటోగ్రాఫర్ శ్రావణ్

Satyam NEWS

Leave a Comment